నా కల నెరవేరింది..! పదవీ విరమణ రోజు డీజీగా ఏబీ వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరణ
ప్రింటింగ్ మరియు స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రెండు సంవత్సరాల తరువాత ఇదే ఆఫీస్ లో ఛార్జ్ తీసుకున్నా.

AB Venkateswara Rao : సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్, స్టేషనరీ డీజీగా పదవిని అప్పగించింది. దీంతో విజయవాడలోని ప్రింటింగ్ ప్రెస్ కు చేరుకున్న వెంకటేశ్వరరావు డీజీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఉద్యోగుల బాధ్యతల్లో ఈరోజే ఆయనకు చివరి రోజు కావడంతో సాయంత్రం పదవీ విరమణ చేయనున్నారు.
Also Read : ఏపీని ఏకీపారేస్తున్న ఎండలు.. వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలు.. ఉదయం నుంచే ఉక్కపోత..
ప్రింటింగ్ మరియు స్టేషనరీ డీజీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రెండు సంవత్సరాల తరువాత ఇదే ఆఫీస్ లో ఛార్జ్ తీసుకున్నా. నాకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు నా పదవీ విరమణ రోజు. ఈరోజే పోస్టింగ్ తీసుకున్నా. పోస్టింగ్ తీసుకున్నరోజు సాయంత్రమే పదవీ విరమణచేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నానని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.
Also Read : పదిలో పది సార్లు ఫెయిల్.. 11వ సారి పాసైన యువకుడు.. గ్రామంలో భారీగా ఊరేగింపు.. ఎందుకంటే?
ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాను. ఎటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయి. విధుల్లో చేరాను. ఇప్పటికి ఇంత వరకు మాత్రమే మాట్లాడాలి. ఇంతకాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయోభిలాషులకు రుణపడి ఉంటా. నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు. యూనిఫాంతో రిటైర్మెంట్ కావడం నాకల నెరవేరినట్లుగా భావిస్తున్నట్టు చెప్పారు.