పదిలో పది సార్లు ఫెయిల్.. 11వ సారి పాసైన యువకుడు.. గ్రామంలో భారీగా ఊరేగింపు.. ఎందుకంటే?
నామ్ దేవ్ ముండే కుమారుడు కృష్ణ. 2018లో నుంచి టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఇప్పటికు 10సార్లు టెన్త్ పరీక్షలకు హాజరైన పాస్ కాలేకపోయాడు.

Krishna Namdev Munde
Boy Passed 10th Class 11th Attempt in Maharashtra : పదవ తరగతిలో మొదటిసారి పరీక్షలోనే ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతుంటారు. మొదటిసారి పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు రెండు, మూడు, నాలుగు సార్లు పరీక్షరాసి ఉత్తీర్ణులైన ఘటనలు చూశాం. కానీ, మహారాష్ట్రంలో ఓ యువకుడు ఏకంగా 10సార్లు పదవ తరగతి పరీక్షరాసినప్పటికీ పాస్ కాలేదు. ఇటీవల 11వ సారి పదోతరగతి పరీక్షరాసి పాస్ అయ్యాడు. మహారాష్ట్రలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు మే 27న విడుదలయ్యాయి. మహారాష్ట్రలోని బీడు గ్రామానికి చెందిన ఓ యువకుడు 10వ తరగతిలో 11వ సారి పరీక్ష రాసి పాసయ్యాడు. కొడుకు పరీక్ష పాస్ కావటంతో అతని తండ్రి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. దీంతో కొడుకును పెళ్లి కుమారుడిలా తయారు చేసి గ్రామంలో భారీగా ఊరేగింపు నిర్వహించారు.
Also Read : AI Revolution : టెక్‌వరల్డ్‌లో ఏఐ విప్లవం.. ఏఐ టెకీలకు భారీ వేతనాలు
మహారాష్ట్రలోని బీడు గ్రామానికి చెందిన నామ్ దేవ్ ముండే కుమారుడు కృష్ణ. 2018లో నుంచి టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. ఇప్పటి వరకు 10సార్లు టెన్త్ పరీక్షలకు హాజరైన పాస్ కాలేకపోయాడు. అయితే, నామ్ దేవ్ ముండేకు తనకొడుకు పది పరీక్షల్లో పాస్ కావాలని కోరిక. అందుకే ఆయన కొడుకు కృష్ణ పై ఎప్పుడు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. కచ్చితంగా పదో తరగతి పాస్ కావాలని ప్రోత్సహిస్తూ వచ్చాడు. చివరకు 11వ సారి పదో తరగతి పరీక్షలు రాసి కృష్ణ పాస్ అయ్యాడు. దీంతో తండ్రి నామ్ దేవ్ సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. కొడుకు పాస్ కావటంతో గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. గ్రామ ప్రజలుసైతం కృష్ణకు ఘనంగా స్వాగతం పలికి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.