Lingamaneni Guest House : లింగమనేని నివాసం జప్తు.. ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు, చంద్రబాబుకి ఏం సంబంధం అంటున్న తమ్ముళ్లు

Lingamaneni Guest House : ప్రభుత్వమే ఈ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. లేని ఇన్నర్ రింగ్ రోడ్డుని ఉన్నట్లుగా చూపించారు.

Lingamaneni Guest House : లింగమనేని నివాసం జప్తు.. ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు, చంద్రబాబుకి ఏం సంబంధం అంటున్న తమ్ముళ్లు

Lingamaneni Guest House

Updated On : June 30, 2023 / 10:41 PM IST

Lingamaneni Guest House – ACB Court : విజయవాడలో కరకట్ట మీదున్న లింగమనేని నివాసం జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జప్తు చేయటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ కు అనుమతి ఇచ్చింది. లింగమనేని రమేశ్ తో పాటు మిగతా ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని చెప్పింది. గెస్ట్ హౌస్ ను జప్తు చేయడంతో పాటు నారాయణ ఆస్తులను పాక్షికంగా జప్తు చేసేందుకు అనుమతి మంజూరు చేసింది ఏసీబీ కోర్టు.

లింగమనేని ఆస్తులపై ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబుకి ఏం సంబంధం అని టీడీపీ నేత బోండా ఉమ ప్రశ్నించారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా చంద్రబాబు ఎలా లబ్ది పొందుతారని ఆయన ప్రశ్నించారు. న్యాయస్థానాన్ని వైసీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆయన అన్నారు. ఉండవల్లిలోని తాను ఉంటున్న ఇంటికి చంద్రబాబు అద్దె చెల్లిస్తున్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటికే చూపించినట్లు బోండా ఉమ చెప్పారు. ఉన్నత న్యాయస్థానంలో ప్రభుత్వానికి పరాభవం తప్పదన్నారు బోండా ఉమ.

Also Read..Pawan Kalyan: వ్యక్తిగత విషయాలపై మాట్లాడడం చిల్లర వ్యవహారం.. జగన్ వ్యక్తిగత జీవితం నాకు తెలుసు.. నేను చెప్పేది వింటే..

ఇదసలు క్విడ్ ప్రోకో కానే కాదు- బోండా ఉమ, టీడీపీ నేత
లింగమనేని రమేశ్ భూములు పక్క నుంచి వెళ్లేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారు. కాబట్టి ఆయన ప్రాపర్టీని అటాచ్ చేసేందుకు అనుమతి కోరింది. వాస్తవాలు ఎలాగున్నా ముందు అటాచ్ మెంట్ చేయమని కోర్టు చెప్పి ఉండొచ్చు. కానీ, తెలుగుదేశం పార్టీకి ఆ ఇష్యూకి సంబంధమే లేదు. లింగమనేని రమేశ్ ఇంటిని చంద్రబాబు అద్దెకు తీసుకున్నారు. అద్దె కూడా చెల్లిస్తున్నారు. అదొక ఇష్యూ.

అసలు ప్రభుత్వమే ఈ కేసులో న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. ఎందుకు పట్టింస్తోంది అంటే.. లేని ఇన్నర్ రింగ్ రోడ్డుని ఉన్నట్లుగా చూపించారు. క్విడ్ ప్రోకో ఎవరు? రూ.43వేల కోట్లు కొట్టేసి వాళ్లకి లక్ష కోట్ల లబ్ది చేకూర్చడం నీది క్విడ్ ప్రోకో. ఇక్కడసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు ఉన్నట్లు కాగితాల మీద చూపించి ఏసీబీ కోర్టులో నువ్వు స్టే తెచ్చుకున్నోడివి దీన్ని క్విడ్ ప్రో కో అనడంలో అసలు అర్థమే లేదు.

Also Read.. KethiReddy Venkatarami Reddy : చిరంజీవి చాలా మంచి వారు, అయినా ఓడిపోయారు.. చంద్రబాబు 7సార్లు దొంగ ఓట్లతోనే గెలిచారు

కాగా, క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్ ను చంద్రబాబు పొందారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఆదేశాలతో ఏపీ సీఐడీ విచారణ జరిపింది. ఏసీబీ కోర్టులో అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించింది. విచారణ చేసిన కోర్టు.. క్విడ్ ప్రో కోలో భాగంగానే చంద్రబాబు లింగమనేని గెస్ట్ హౌస్ పొందారని ధృవీకరించింది.