విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం కేసు…రాయపాటి కోడలు మమతపై విచారణ

  • Published By: bheemraj ,Published On : August 14, 2020 / 03:22 PM IST
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం కేసు…రాయపాటి కోడలు మమతపై విచారణ

Updated On : August 14, 2020 / 4:02 PM IST

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. 3 గంటలుగా డాక్టర్ రాయపాటి కోడలు మమతను విచారిస్తున్న ఏసీబీ ….సూర్యచంద్రరావు, రమేష్ ఆస్పత్రుల్లో పేషెంట్ల నుంచి వసూలు చేస్తున్న ఫీజులపై ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలైన మమత..రమేష్ ఆస్పత్రి మేనేజ్ మెంట్ లో సభ్యురాలిగా ఉన్నారు. ఆస్పత్రి వ్యవహారాల్లో ఆమె కీలక పాత్ర పోషించిందని కోవిడ్ సెంటర్ నడపడంలో మమతదే కీ రోల్ అని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా కరోనా బారిన పడి ఇటీవలే డాక్టర్ మమత కోలుకున్నారు.

మరోవైపు విజయవాడ పోలీసుల తీరుపై డాక్టర్ మమత భర్త రాయపాటి రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో ప్రమాదం జరిగితే గుంటూరు రమేష్ ఆస్పత్రిలో పని చేస్తున్న మమతకు సంబంధమేంటని ప్రశ్నించారు. మమతపై అన్యాయంగా కేసులు పెడితే న్యాయపోరాటానికైనా సిద్ధమేనని అన్నారు.

విచారణకు హాజరు కావాలని నిన్న రాత్రి మమతకు నోటీసు పంపించారు. గుంటూరు రమేష్ హాస్పిటల్ సీఈవో వరకే మమత బాధ్యతని తెలిపారు. ఆమెకు కోవిడ్ సోకడంతో అనారోగ్యంగా ఉన్నారని…ట్రీమ్ మెంట్ ఇంకా పూర్తి కాలేదు.. విచారణకు రావడం వీలుకాదని చెప్పామని పేర్కొన్నారు. కానీ విచారణకు రాకపోతే మమతను అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పడంతో న్యాయపరంగా నోటీసులు ఇచ్చారు కాబట్టి మమత విచారణకు వెళ్లారని చెప్పారు.

మమతకు నోటీసులు పంపడం పట్ల కుటుంబసభ్యులుగా అందరం బాధపడుతున్నామని చెప్పారు. నెల రోజులుగా మమత విధులకు హాజరుకావడం లేదన్నారు. రమేష్ ఆస్పిటల్ కింద నాలుగైదు బ్రాంచీలున్నాయి.. అందరి సీఈవోలను తీసుకొస్తారా? వేరే ఆస్పిటల్ సీఈవోను ఎలా తీసుకొస్తారు? విజయవాడకు మమతకు సంబంధమేంటని ప్రశ్నించారు.

ఆమె విజయవాడ వచ్చి ఆపరేషన్ చేశారా.. గుంటూరు రమేష్ ఆస్పత్రిలో పని చేస్తున్న మమతకు సంబంధమేంటి.. ఎందుకు నోటీసు ఇచ్చారని ప్రశ్నించారు. విజయవాడలో ఉన్న వారికి నోటీసులు ఇవ్వాలి.. వారిని విచారించాలి కానీ మమతకు నోటీసు ఇస్తారని నిలదీశారు. కావాలని కక్షపూరితంగానే మమతకు నోటీసు పంపించారని మండిపడ్డారు.