దిశ చట్టం : వైసీపీ నేతలపై యాక్షన్ తీసుకోవాలి – బాబు

అత్యాచార ఘటనలు, వేధింపులపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని టీడీపీ సపోర్టు చేస్తుందని ప్రకటించారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. కానీ వైసీపీ ప్రజాప్రతినిధులపై పలు ఆరోపణలున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు బాబు. నిర్భయ చట్టం దేశంలో సంచలనం సృష్టించింది.. కానీ అమలులో లోపాలున్నాయన్నారు. చట్టాలు తీసుకరావడం ఎంత ముఖ్యమో..అమలు కూడా అంతే ముఖ్యమన్నారు. 2019, డిసెంబర్ 13వ తేదీ దిశ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిపై బాబు మాట్లాడుతూ..వైసీపీ నేతలపై ఆరోపణలు గుప్పించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
సమస్యలను అధిగమిస్తూ..ముందుకు పోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. ఈ బిల్లులో 21 రోజుల్లో కేసులు ఎస్టాబ్లిస్ మెంట్ చేయడం..తదితర విషయాలు ఉన్నాయన్నారు. ఇన్ స్టంట్ న్యాయం చేయాలి..కానీ ఇన్ స్టంట్ చేయడం నష్టమొస్తుందని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు.
* 2016 నుంచి 2019 సంవత్సరకాలంలో జరిగిన నేరాల గణాంకాలను చదివి వినిపించారు.
* దేశంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న అఫిడవిట్స్ చేసిన వాటిని క్రోడీకరించారనే అనే విషయాన్ని గుర్తు చేశారు.
* ఇందులో బీజేపీ టాప్ లో ఉంది..ఇందులో 7గురు వైసీపీ నేతలున్నారు.
* దేశంలో మహిళలపై ప్రజాప్రతినిధులు దాడులు చేయడంలో, అత్యాచారాలు చేయడంలో మూడో ప్లేస్ లో వైసీపీ ఉందని బాబు ఆరోపించారు.
* ఎంపీలు ముగ్గురు, ఎమ్మెల్యేలు నలుగురిపై తీవ్ర ఆరోపణలున్నాయి..వీటిని తెప్పించుకుని యాక్షన్ తీసుకోవాలి.
* దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
* బాబు చేసిన ఆరోపణలను వైసీపీ తిప్పికొట్టింది.
Read More : బూతులు రావు : నో క్వశ్చన్ అంటే..బాస్టర్డా ? – బాబు