బీజేపీలో ఉన్నాను.. టికెట్ ఇస్తే ఏపీలో పోటీ చేస్తా: జయప్రద

పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు అంటే ఇష్టమని సీనియర్ నటి జయప్రద వెల్లడించారు. బీజేపీ తరపున పోటీ చేయాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు.

బీజేపీలో ఉన్నాను.. టికెట్ ఇస్తే ఏపీలో పోటీ చేస్తా: జయప్రద

Jaya Prada : నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు సీనియర్ నటి జయప్రద. తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఆమె తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను భారతీయ జనతా పార్టీలో ఉన్నానని, తనకు అవకాశం ఇస్తే ఏపీ ప్రజలకు సేవ చేసుకుంటానని చెప్పారు.

తాను ఏపీ బిడ్డను అని అందరికీ తెలుసునని, బీజేపీ నాయకులు పిలిస్తే స్టార్ కాంపైనర్‌గా ఏపీలో ప్రచారం చేస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని, స్పెషల్ స్టేటస్ లేవని.. వాటి కొరకు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఏపీలో సమస్యలు పరిష్కరించే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చంద్రబాబు అంటే ఇష్టమని జయప్రద వెల్లడించారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల స్వామివారిని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రేమాండ్స్ అధినేత గౌతమ్ సింఘానియా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ సింఘానియా మాట్లాడుతూ.. ముంబైలో నిర్మాణంలో ఉన్న శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2025 సెప్టెంబర్ 9న ప్రారంభిస్తామని తెలిపారు. 70 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయం నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు.

తిరుమల సమాచారం
నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 56,228
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.04 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

Also Read: టీడీపీ రికార్డ్‌ సృష్టిస్తుందా, వైసీపీ హ్యాట్రిక్‌ కొడుతుందా.. కొండారెడ్డి బురుజుపై ఎగిరే జెండా ఏది?