High Court: అమరావతి కేసులపై విచారణ వాయిదా
అమరావతి రాజధాని కేసులపై దాఖలైన వ్యాజ్యాల విచారణను వాయిదా వేసింది హైకోర్టు.

Adjorn
High Court: అమరావతి రాజధాని కేసులపై దాఖలైన వ్యాజ్యాల విచారణను వాయిదా వేసింది హైకోర్టు. జనవరి 28వ తేదీకి హైకోర్టు విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది కోర్టు. జనవరి 28వ తేదీ నుంచి పూర్తిస్థాయి వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. రైతుల తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్.. పిటిషన్లపై విచారణ కొనసాగాలని కోర్టును కోరారు.
వ్యాజ్యాలపై స్పందించిన హైకోర్టు.. సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరిచుకోగా.. ఇంకా కొనసాగాల్సిన అంశాలు ఏం ఉన్నాయనే వివరాలను 10 రోజుల్లోగా నోటిఫై చెయ్యాలని ఆదేశించింది. రైతుల దాఖలు చేసే నోట్‌పై స్పందన తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం అఫడివిట్, వ్యాజ్యాలపై పూర్తిస్థాయిలో విచారణను జనవరి 28వ తేదీనే జరపనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
నేడు రాజధాని కేసుల విచారణ సందర్భంగా.. విచారణను జనవరి 31కి వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ న్యాస్థానాన్ని కోరారు. మరోవైపు రైతులు తరఫున సుప్రీం కోర్టు లాయర్ శ్యామ్ దివాన్ హైకోర్టులో వాదనలు వినిపించారు.