Chandrababu House: కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. శాస్త్రోక్తంగా భూమి పూజ
ఇంటి నిర్మాణం కోసం కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం వద్ద జాతీయ రహదారి పక్కన రెండు ఎకరాల స్థలాన్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. గత ఏడాది జూలైలోనే రిజిస్ట్రేషన్ పూర్తి అయింది.

Chandrababu House Construction
Chandrababu House Construction : చిత్తూరు జిల్లా కుప్పం(Kuppam)లో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)సొంత ఇంటి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. చంద్రబాబు ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. దీంతో ఇంటి నిర్మాణానికి శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఇంటి నిర్మాణం కోసం కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం వద్ద జాతీయ రహదారి పక్కన రెండు ఎకరాల స్థలాన్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. గత ఏడాది జూలైలోనే రిజిస్ట్రేషన్ పూర్తి అయింది. అయితే, వివిధ కారణాల వలన ఇంటి నిర్మాణానికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతులు మంజూరు చేయకపోవడంతో వివాదం చెలరేగింది.
అన్ని పత్రాలు సమర్పించినా ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వకపోవడం పట్ల ఇటీవల కుప్పం పర్యటనలోనూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కాగా, తాజాగా చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.