P4 Policy : P4 కార్యక్రమానికి సర్వం సిద్ధం.. అక్కడి నుంచే లాంచింగ్..

దాదాపు 10వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రభుత్వం ప్లాన్ చేయడం జరుగుతోంది.

P4 Policy : P4 కార్యక్రమానికి సర్వం సిద్ధం.. అక్కడి నుంచే లాంచింగ్..

Updated On : March 23, 2025 / 9:08 PM IST

P4 Policy : కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీ4 కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఉగాది రోజు నిర్వహించే పీ4 కార్యక్రమానికి వేదిక ఖరారైంది. ఏపీ సచివాలయం వెనక సభా ప్రాంగణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభ కోసం ప్రతీ నియోజకవర్గం నుంచి 50 మంది పేదల చొప్పున మొత్తం 10వేల మందితో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సమాజంలో ధనిక వర్గాలు పేదలను ఆదుకునేలా పీ4 కార్యక్రమం లక్ష్యం. మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద 4 గ్రామాలను తీసుకున్నారు.

పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్ షిప్ పీ4 పేరుతో చంద్రబాబు ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ధనికులతో పేదలను ఆదుకునేలా అంటే.. పేదల కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం. వారి అవరసరాలను తీర్చే విధంగా కార్యక్రమాలు చేపట్టనున్నారు. కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని పీ4 ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఉగాది నుంచి ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఏపీ సెక్రటేరియట్ వెనక భాగాన్ని సభా వేదికగా నిర్ణయించారు.

దాదాపు 10వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రభుత్వం ప్లాన్ చేయడం జరుగుతోంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం ధనికులను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వారి ద్వారా కొన్ని గ్రామాలను దత్తత తీసుకోని ఆయా నియోజకవర్గాల్లోని పేదలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది.

Also Read : అన్యమత ఉద్యోగులు బదిలీ..! టీటీడీలో సంస్కరణలపై సీఎం చంద్రబాబు ఫోకస్..

మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద 4 గ్రామాల్లో పీ4 కార్యక్రమం ప్రారంభించనున్నారు. కార్యక్రమం అమల్లో లోటుపాట్లపై స్టడీ చేయడం, పీ4 ను ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేదానిపై స్టడీ చేయడం జరుగుతుంది. తొలుత నాలుగు గ్రామాల్లో విజయవంతం చేసి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ పీ4 కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.