అసనగిరి కొండల్లో ‘అల్లూరి సీతారామరాజు’ గుహలు

  • Published By: madhu ,Published On : February 26, 2020 / 01:25 PM IST
అసనగిరి కొండల్లో ‘అల్లూరి సీతారామరాజు’ గుహలు

Updated On : February 26, 2020 / 1:25 PM IST

విశాఖపట్టణంలోని నాతవరం మండలం అసనగిరి ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు నివాస గుహలున్నాయా ? అంటే ఎస్ అంటున్నారు మైనింగ్ శాఖ అధికారులు. ఉన్నాయంటూ..ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు కూడా. బ్రిటీష్ కాలంలో అల్లూరి సీతారామరాజు గుహలను అభివృద్ధి చేయాలంటూ గ్రామస్తులు చేస్తున్న పోరాటాన్ని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ హర్ణచంద్ర స్పందించి..అసెంబ్లీ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.

టీడీపీ నేతలు అడ్డగోలుగా లేటరైట్ తవ్వకాలు జరిపారని, క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ కంప్లయింట్ చేశారు. దీనిపై 2020, జనవరి 28న అనకాపల్లి మైనింగ్ ఏడీ వెంకట్రావు ఆధ్వర్యంలో నాతవరం మండలం సుందరకోట పంచాయతీ శివారులోని అసనగిరి గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులతో ముచ్చటించారు. లేటరైట్ నిక్షేపాల కోసం గత ప్రభుత్వం సింగం భవానీ పేరిట అనుమతిలిచ్చిందని, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు లక్షలాది టన్నుల లేటరైట్ మట్టిని యథేచ్చగా తరలించుకపోయారనే ఆరోపణలున్నాయి.

ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కొంతమంది ఆందోళన చేసినా..ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కొంతమంది కోర్టు తలుపులు తట్టారు. కోర్టు ఆదేశాలతో తవ్వకాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం మైనింగ్ ఏడీ బృందం చేసిన అధ్యయనం చేసిన విషయాలన్నింటిపై ఓ నివేదిక తయారు చేసి..ప్రభుత్వానికి అందించింది. 

Read More : జూబ్లీహిల్స్ 45లో ట్రాఫిక్ ఆంక్షలు