AP Elections 2024: ఎన్నికల వేళ చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్

అనంతరం ఆమెను టీడీపీ పుంగనూరు ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో..

AP Elections 2024: ఎన్నికల వేళ చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్

Tdp

Updated On : April 21, 2024 / 6:11 PM IST

ఎన్నికల వేళ చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీలో చేరనున్నారు. శ్రీనాథ్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లి వైసీపీలోకి ఆహ్వానించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి.

ఏపీ సీఎం జగన్ సమక్షంలో త్వరలోనే శ్రీనాథ్ రెడ్డి దంపతులు వైసీపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ నుంచి శ్రీనాథ్ రెడ్డి భార్య అనిషారెడ్డి పోటీ చేశారు. అనంతరం ఆమెను టీడీపీ పుంగనూరు ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకు శ్రీనాథ్ రెడ్డి, అనిషారెడ్డి దూరంగా ఉంటున్నారు.

చిత్తూరు జిల్లా టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్నారు అమర్నాథ్ రెడ్డి. ఇప్పుడు ఆయనకు షాక్ ఇస్తూ ఆయన తమ్ముడు, మరదలు నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల వేళ ఇవాళ టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు బీఫాంలు అందజేసిన విషయం తెలిసిందే. వచ్చే నెల 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి.

ఆయన భాషపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: ఎమ్మెల్యే వివేకానంద