ఆయన భాషపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: ఎమ్మెల్యే వివేకానంద

Vivekananda: కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయనందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆయన భాషపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: ఎమ్మెల్యే వివేకానంద

Vivekananda

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భాష అనాగరికమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. ఆయన వాడుతున్న భాషపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సీనియర్ నేతలను తొక్కుకుంటూ పైకి వచ్చానని సీఎం అన్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు ముందుగా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని నిలదీశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సర్కారు పట్టించుకోవడం లేదని తెలిపారు. రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తామని ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తిట్ల పురాణాన్ని ఆపాలని, హామీల అమలు ఎప్పుడో చెప్పాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయనందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో టీడీపీని పూర్తిగా ముంచిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూ అదే గతి పట్టించబోతున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై సీఎంను కలిస్తే దాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో ఆర్ టాక్స్, బీ టాక్స్ పై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తామని చెప్పారు. ప్రజలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో తేడా తెలిసిపోయిందని అన్నారు.

ఆ పుస్తకాన్ని ఈ నియోజక వర్గంలో 75 వేల మందికి పంచుతాను: రఘునందన్ రావు