Ambati Rambabu: అందుకే నేను పవన్ కల్యాణ్ గురించి ఇలా మాట్లాడుతున్నాను: అంబటి రాంబాబు మరోసారి..
ఇతర సినిమాల గురించి తానేం మాట్లాడడం లేదని అంబటి రాంబాబు గుర్తు చేశారు.

Ambati Rambabu
Ambati Rambabu – Pawan Kalyan: జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu)కి ఎందుకు గుచ్చుకుంటుందని నిలదీశారు. పవన్ తన జోలికి వచ్చారని, అందుకే తాను కూడా ఆయన గురించి మాట్లాడుతున్నానని అన్నారు.
పవన్ కల్యాణ్ కి నిజాయితీ లేదని అంబటి రాంబాబు చెప్పారు. తన గురించి బ్రో మూవీలో వ్యంగ్యంగా మాట్లాడారు కాబట్టి తాను కూడా పవన్ గురించి మాట్లాడుతున్నానని తెలిపారు. ఇతర సినిమాల గురించి తానేం మాట్లాడడం లేదని గుర్తు చేశారు. నీటి పారుదల శాఖ గురించి పలు ప్రశ్నలు వేశానని, వాటికి పవన్ కల్యాణ్ సమాధానం చెప్పలేదని అన్నారు. చంద్రబాబు బుధవారం చెప్పినవన్నీ అసత్యాలేనని చెప్పారు.
చంద్రబాబుకి అంబటి ప్రశ్నలు
2018లో పోలవరాన్ని పూర్తిచేస్తామన్న చంద్రబాబు ఎందుకు చేయలేదు?
చంద్రబాబు నాయుడు తన స్థాయి దిగజారి ఎందుకు మాట్లాడుతున్నారు?
చంద్రబాబుకు శంకుస్థాపనలు చేయడం తప్ప పూర్తి చేయడం తెలియదా?
పోలవరం, పులిచింతల ప్రాజెక్టులను ఎవరు ప్రారంభించారు?
కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు?
కాఫర్ డ్యాం పూర్తి కాకుండా డయా ఫ్రం వాల్ ఎందుకు కట్టారు?
పోలవరానికి శంకుస్థాపన చేసింది వైఎస్సార్ కాదా?
చంద్రబాబు తాను ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టు ఉందా?
Bro Movie : ‘కాంబాబు రాసలీలలు’ మూవీ పోస్టర్ రిలీజ్.. సంజన, సుకన్య క్యాప్షన్.. త్వరలో గంటా, అరగంట..!