తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Amith Shah Visits Tirumala Temple

Updated On : May 31, 2024 / 11:45 AM IST

Amit Shah : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అమిత్ షాకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం శ్రీవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. అర్చకులు అమిత్ షాకు వేదాశీర్వచనం పలికారు.

Also Read : దేశంలో ఏ రాష్ట్రంలో లేని రూల్స్ ఏపీలో అమలు చేస్తున్నారు- ఎన్నికల సంఘంపై పేర్నినాని

గురువారం సాయంత్రమే అమిత్ షా రేణిగుంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాత్రి సమయంలో తిరుమలలోని వకుళామాత అతిథిగృహంలో బస చేశారు. శుక్రవారం ఉదయం బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని అమిత్ షా  దర్శించుకున్నారు. మధ్యాహ్నం సమయానికి తిరుమల నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు.