దేశంలో ఏ రాష్ట్రంలో లేని రూల్స్ ఏపీలో అమలు చేస్తున్నారు- ఎన్నికల సంఘంపై పేర్నినాని
మచిలీపట్నంలో 4వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. వారిలో ఇతర ప్రాంతాల వారు సైతం ఉన్నారు. చట్టాన్ని మీరి ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తుంది.

Perni Nani : ఎన్నికల సంఘం వ్యవహారంపై మాజీ మంత్రి పేర్నినాని హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారి, కేంద్ర ఎన్నికల సంఘం అందరూ కేంద్రం ఒత్తిడికి లొంగి పని చేస్తున్నారని గత కొంత కాలంగా మేము ఆరోపిస్తున్నామన్నారు. టీడీపీ చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ అనుకూల మీడియాలో వార్త వస్తే చాలు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ నేతలపై కేసులు పెట్టొద్దని కలెక్టర్లు, ఆర్వోలను బెదిరిస్తున్నారని పేర్నినాని ఆరోపించారు. సాధ్యమైనంత వరకు వైసీపీపై ఎక్కువ కేసులు పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు.
”ఫోరమ్ 12 ఏ అనేది ఎక్కడ నుండి వచ్చింది? అని ఆయన ప్రశ్నించారు. 13 ఎ, 13 బీ పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారు. దానికి గెజిటెడ్ ఆఫీసర్ సర్టిఫికెట్ ఇస్తారు. స్టాంప్ వేయకపోయినా, డిజెగ్నినేషన్ లేకపోయినా పర్లేదని సర్క్యులర్ ఇచ్చారు. మచిలీపట్నంలో 4వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. వారిలో ఇతర ప్రాంతాల వారు సైతం ఉన్నారు. చట్టాన్ని మీరి ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తుంది.
మేము ఈ సమస్యను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశాము. దేశంలో ఏ రాష్ట్రంలో లేని రూల్స్ ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నారు. నేను ఇచ్చిన మెమో వెనక్కి తీసుకుంటాను అని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా అంటున్నారు. అంటే, ఆయన తప్పు చేశాను అని ఒప్పుకున్నట్లేగా. కచ్చితంగా న్యాయమే గెలిచి తీరుతుంది. టీడీపీ, బీజేపీ చట్టాలను చుట్టాలుగా చేసుకుని వ్యవహరిస్తున్నారు” అని మండిపడ్డారు పేర్నినాని.
Also Read : ఆరు నూరైనా ఫలితమిదే..! ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రొ.నాగేశ్వర్ విశ్లేషణ..