జనవరి 9న బ్యాంకు ఖాతాలో రూ.15వేలు : అమ్మఒడి తుది జాబితా సిద్ధం

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో అమ్మఒడి ఒకటి. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధమైంది. 42 లక్షల 80వేల మంది లబ్ధిదారులను

  • Published By: veegamteam ,Published On : January 1, 2020 / 10:52 AM IST
జనవరి 9న బ్యాంకు ఖాతాలో రూ.15వేలు : అమ్మఒడి తుది జాబితా సిద్ధం

Updated On : January 1, 2020 / 10:52 AM IST

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో అమ్మఒడి ఒకటి. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధమైంది. 42 లక్షల 80వేల మంది లబ్ధిదారులను

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో అమ్మఒడి ఒకటి. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల తుది జాబితా సిద్ధమైంది. 42 లక్షల 80వేల మంది లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేసింది. గురువారం(జనవరి 2,2020) అధికారికంగా జాబితాను ప్రకటించనుంది. ఈ లిస్ట్ ను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. జనవరి 4, 6, 7, 8 తేదీల్లో అర్హులైన వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జనవరి 9వ తేదీన చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు.

డబ్బు లేక ఏ ఒక్క చిన్నారి చదువుకు దూరం కాకూడదన్న గొప్ప ఆలోచనతో ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు జగన్ తెలిపారు. బిడ్డలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి ఈ పథకం కింద ఆర్థిక సాయంగా ఏటా రూ.15వేలు బ్యాంకు అకౌంట్లో జమ చేస్తారు. ఈ పథకాన్ని ముందుగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రవేశపెట్టాలని అనుకున్నా.. తర్వాత ఇంటర్ వరకు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. అమ్మఒడి కోసం బడ్జెట్ లో రూ.6,455.80కోట్లు కేటాయించారు. అయితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిధులను కూడా ప్రభుత్వం సమీకరించింది. జనవరి 9న అర్హులైన విద్యార్థి తల్లి/సంరక్షకులు ఖాతాలో రూ.15వేలు జమ కానున్నాయి.

రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్‌ పాఠశాలలు… ప్రభుత్వ-ప్రైవేట్‌ జూనియర్ కాలేజీలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులు/సంరక్షకులు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అమ్మ ఒడి స్కీమ్‌ అర్హతకు తెల్ల రేషన్‌ కార్డు మస్ట్. అలాగే లబ్ధిదారులకు ఆధార్‌ కార్డు తప్పనిసరి. స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే విద్యార్థులు కనీసం 75శాతం హాజరును కలిగి ఉండాలి. ఒకవేళ పిల్లలు మధ్యలో తమ చదువును నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు ఈ పథకానికి అనర్హులు. ఆర్థిక సాయాన్ని తిరిగి అందుకోవాలంటే పాఠశాలకు పిల్లలు తిరిగి హాజరు కావాలి.

Also Read : ఇదే ప్రాసెస్: ఫేస్‌‌బుక్‌లో మీ Birth వివరాలు Hide చేయాలా?

Also Read : Instagram Storyలో Photoతో బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చాలంటే?