Anandaiah Medicine: తిరుపతిలో ఆనందయ్య మందు.. ఇంటింటికీ పంపిణీ!

తిరుపతిలో ఆనందయ్య మందు సిద్ధమవుతోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆనందయ్య శిష్యులు మందును తయారు చేస్తున్నారు. కరోనాను రాకుండా అడ్డుకుంటుందని చెబుతున్న ఈ మందు తయారీకి నాలుగు గంటలకుపైగా సమయం పడుతుందని అంటున్నారు నిర్వాహకులు.

Anandaiah Medicine: తిరుపతిలో ఆనందయ్య మందు.. ఇంటింటికీ పంపిణీ!

Anandaiah Medicine Preparing In Tirupati

Updated On : June 7, 2021 / 11:02 AM IST

Anandaiah Medicine in Tirupati: తిరుపతిలో ఆనందయ్య మందు సిద్ధమవుతోంది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆనందయ్య శిష్యులు మందును తయారు చేస్తున్నారు. కరోనాను రాకుండా అడ్డుకుంటుందని చెబుతున్న ఈ మందు తయారీకి నాలుగు గంటలకుపైగా సమయం పడుతుందని అంటున్నారు నిర్వాహకులు. రేపట్నుంచి చంద్రగిరి ప్రజలకు ఆనందయ్య మందు పంపిణీ చేయనున్నట్లు చెబుతున్నారు.

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆనందయ్య మందు నిన్న సాయంత్రం నుంచి మందు తయారీ కొనసాగుతుండగా.. ఆనందయ్య కుమారుడు శ్రీధర్ ఇతర శిష్యులు ఆధ్వర్యంలో ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సాయంత్రం కల్లా మందు తయారు చేసి, రేపటి నుంచి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు పంపిణీ చేయనున్నారు. ప్యాకెట్ల రూపంలో ఇంటింటికీ మందు పంపిణీ చేస్తామని చెబుతున్నారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.

మరోవైపు ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టు నేడు తుది తీర్పు ఇవ్వనుంది.. ఇప్పటికే ఈ అంశంపై విచారణ పూర్తి చేసిన హైకోర్టు. నేడు తీర్పు వెలువరిస్తామని తెలిపింది. చుక్కల మందుపై ఆయుష్‌ శాఖ ఇప్పటికే నివేదిక సమర్పించింది.. హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.