AP Covid-19 Update : ఏపీలో కొత్తగా 156 కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న 262 కోవిడ్ కేసులు నమోదు కాగా నేడు 156 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల

AP Covid-19 Update : ఏపీలో కొత్తగా 156 కోవిడ్ కేసులు

Ap Covid Cases Update

Updated On : November 13, 2021 / 5:11 PM IST

AP Covid-19 Update :  ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు నిన్నటితో పోలిస్తే ఈరోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న 262 కోవిడ్ కేసులు నమోదు కాగా నేడు 156 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

నిన్న కోవిడ్ నుంచి 254 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్ళారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3 వేల 128 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.  రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షల 69వేల 770 కి చేరింది. వీరిలో 20 లక్షల 52 వేల 230 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.

ఏపీలో గత 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14 వేల 412కు చేరింది. నిన్నటివరకు రాష్ట్రంలో 2 కోట్ల 99లక్షల 50వేల 579 మంది శాంపిల్స్ పరీక్షించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Ap Covid Report

               Ap Covid Report