Andhra Pradesh : ఏపీలో కొత్తగా 1,184 కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,184 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.

Andhra Pradesh : ఏపీలో కొత్తగా 1,184 కేసులు

Updated On : September 26, 2021 / 5:56 PM IST

Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,184 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. గత 24 గంటల్లో వైరస్‌ నుంచి 1,333 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,19,657 చేరింది. ఇక రాష్ట్రంలో కరోనా కారణంగా మృతి చెందిన వారి సం‍ఖ్య 14,136కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Read More : Botsa Satyanarayana : మేం సన్నాసులమైతే.. నువ్వు రుషిపుంగవుడివా..?

జిల్లాల వారిగా నమోదైన కేసుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే..

అనంతపురం జిల్లాలో 14, చిత్తూరు జిల్లాలో 165, తూర్పుగోదావరి జిల్లాలో 218, గుంటూరు జిల్లాలో 150, కడప జిల్లాలో 59, కృష్ణా జిల్లాలో 116, కర్నూలు జిల్లాలో 03, నెల్లూరు జిల్లాలో 138, ప్రకాశం జిల్లాలో 114, శ్రీకాకుళం జిల్లాలో 27, విశాఖపట్నం జిల్లాలో 35, విజయనగరం జిల్లాలో 20, పశ్చిమగోదావరి జిల్లాలో 126 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.