AP Covid 19 Cases : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా మరోసారి 900కి దిగువనే కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసులు మరింత తగ్గాయి. నిన్న 865 కేసులు నమోదవగా, తాజాగా 765 కేసులు

Ap Covid 19 Cases
AP Covid 19 Cases : ఏపీలో కరోనా కొత్త కేసుల సంఖ్య భారీగా తగ్గింది. తాజాగా మరోసారి 900కి దిగువనే కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసులు మరింత తగ్గాయి. నిన్న 865 కేసులు నమోదవగా, తాజాగా 765 కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 45వేల 481 పరీక్షలు నిర్వహించగా.. 765 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,52,763 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. మరోవైపు కొవిడ్ తో మరో 9మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 14,204కి చేరింది. 24 గంటల వ్యవధిలో 973 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,28,202కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10వేల 357 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,84,45,952 శాంపుల్స్ ను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
Gangrene Disease : కరోనా బారిన పడినవారికి మరో ముప్పు
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనాతో ఇద్దరు చొప్పున మృతి చెందారు. చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, విశాఖలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
Kangana Ranaut : నాగ చైతన్య – సమంత విడాకులు..అమీర్ ఖాన్ కారణమా ?
జిల్లాల వారిగా కరోనా కేసులు..
తాజాగా నమోదైన కొత్త కేసుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 161 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 94, గుంటూరు జిల్లాలో 91, కడప జిల్లాలో 47, కృష్ణా జిల్లాలో 70, నెల్లూరు జిల్లాలో 91, ప్రకాశం జిల్లాలో 72, శ్రీకాకుళం జిల్లాలో 14, విశాఖపట్నం జిల్లాలో 22, పశ్చిమగోదావరి జిల్లాలో 90 కేసులు నమోదయ్యాయి. అనంతపురం(1), కర్నూలు(3), విజయనగరం(9) జిల్లాల్లో పది లోపే కేసులు నమోదవడం ఊరటనిచ్చే అంశం.
#COVIDUpdates: 03/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,49,868 పాజిటివ్ కేసు లకు గాను
*20,25,307 మంది డిశ్చార్జ్ కాగా
*14,204 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,357#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/Zl2XQBWg90— ArogyaAndhra (@ArogyaAndhra) October 3, 2021