Andhra Pradesh Sero Survey: ఆంధ్రప్రదేశ్‌లో 70శాతం మందికి కొవిడ్ యాంటీబాడీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నాలుగో రౌండ్ సెరో సర్వే నిర్వహించింది. ఇందులో అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. రాష్ట్ర ప్రజల్లో 70శాతం మందికి యాంటీబాడీలు డెవలప్ అయనట్లు తెలిసింది.

Ap Sero Survey
Andhra Pradesh Sero Survey: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నాలుగో రౌండ్ సెరో సర్వే నిర్వహించింది. ఇందులో అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. రాష్ట్ర ప్రజల్లో 70శాతం మందికి యాంటీబాడీలు డెవలప్ అయనట్లు తెలిసింది.
21రాష్ట్రాల్లోని 70జిల్లాల్లో జూన్ 14 నుంచి జులై 6 మధ్య సర్వే నిర్వహించారు. కృష్ణా, నెల్లూర్, విజయనగరాలలో సర్వే జరిగింది. దేశమొత్తంలో మధ్య ప్రదేవ్ 79శాతం యాంటీబాడీలతో టాప్ లో ఉండగా ఆ తర్వాత కేరళ 44.4శాతం యాంటీబాడీలతో కనీస స్థాయిలో ఉంది.
యాంటీబాడీల స్థాయిపై నిర్వహించిన సర్వేలో ఇండియా సగటు 67శాతం. రాష్ట్రవ్యాప్తంగా 12వందల 60బ్లడ్ శాంపుల్స్ సేకరించినట్లు రికార్డులు చెబుతున్నాయి.