Lockdown ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క నెలకు రూ.6వేల కోట్ల నష్టం

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్‌డౌన్ భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ప్రత్యక్ష పన్నుల రూపంలో రావాల్సిన రూ.6వేల కోట్లు నష్టం వచ్చిందని రెవెన్యూ శాఖ చెప్పింది. ప్రత్యక్ష పన్నులతో పాటు పరోక్షంగా రావాల్సిన పన్నులు రాకపోవడంతో భారీ మొత్తంలో నష్టం వచ్చిన ప్రభుత్వ అధికారుల సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాక్‌డౌన్ కారణంగా భారీ మొత్తంలో నష్టం వచ్చినట్లు వెల్లడించారు. ప్రతి రాష్ట్రంలాగే ఆంధ్రప్రదేశ్ లోనూ జీఎస్టీ కలెక్షన్ సున్నా. పెట్రోల్, ఎక్సైజ్ శాఖలపై వ్యాట్ లెక్కించదగ్గది కాదు. వీటి కంటే పరోక్షంగా వచ్చే పన్ను రాకపోవడంతో పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం వచ్చింది. పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థలు కూడా ఉత్పత్తి లేక దారుణమైన నష్టాన్ని చవిచూశాయి.
సీనియర్ ప్రభుత్వ అధికారుల సమాచారం మేరకు ఆంధ్ర ప్రభుత్వం రోజుకు రూ.165కోట్ల నష్టం చవిచూస్తుంది ప్రస్తుతం వస్తుంది కేవలం రూ.3కోట్లు మాత్రమే. ‘ప్రభుత్వమే మద్యం అమ్మకాలు జరుపుతుంది. లాక్ డౌన్ పుణ్యమా అని షాపులు అన్నీ మూసేశారు. పెట్రోల్ బంకులు పాక్షికంగా మాత్రమే పనిచేస్తున్నాయి. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ఇందన అమ్మకాలు కూడా తగ్గిపోయాయి’ అని సీనియర్ అధికారి వెల్లడించారు.
ఆర్థిక నష్టంతో పాటు ప్రభుత్వానికి మరింత భారం పడే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పేదవాడికి రూ.1000 నగదు పథకం కింద రూ.1300కోట్లు కేటాయించాల్సి ఉంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ నిత్యవసరాలు సరఫరా చేసే దానిలో భాగంగా రూ.1400కోట్లు కేటాయించాల్సి ఉంది. రికార్డుల ప్రకారం.. ఏపీలో 1.47కోట్ల మంది రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారు. ఇది చాలా ఆర్థిక భారం.