Andhra University Covid : కరోనా కంటైన్‌మెంట్ జోన్‌గా ఆంధ్ర యూనివర్శిటీ

Andhra University Covid : కరోనా కంటైన్‌మెంట్ జోన్‌గా ఆంధ్ర యూనివర్శిటీ

Andhra University, Covid Containment Zone

Updated On : June 13, 2023 / 3:41 PM IST

Andhra University Covid Containment Zone : విశాఖలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఓ వైపు వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్ర, శనివారాల్లో ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో 109 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

కరోనా సెకండ్‌ వేవ్‌లో తొలి కంటైన్‌మెంట్‌ జోన్‌గా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతాన్ని ప్రకటించారు. ఇప్పటికే ఏయూ ఇంజినీరింగ్‌ హాస్టల్‌ విద్యార్థులందరికీ కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.

పాజిటివ్‌ వచ్చిన 109 మంది విద్యార్థులను ఏయూ హాస్టళ్లలోనే ఐసోలేట్‌ చేయాలని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఆదేశించారు.అక్కడే మూడు ఐసోలేషన్‌ వార్డులు, ఐదు క్వారంటైన్‌ వార్డులను ఏర్పాటు చేశారు.