Election Results : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీదే హవా.. పాతపట్నంలో ఎమ్మెల్యే కుమారుడు ఓటమి

గురువారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. 11 జడ్పీటీసీ స్థానాలకు 8 స్థానాల్లో విజయం సాధించింది వైసీపీ.. మిగతా మూడు స్థానాలను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది.

Election Results : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ వైసీపీదే హవా.. పాతపట్నంలో ఎమ్మెల్యే కుమారుడు ఓటమి

Election Results (2)

Updated On : November 19, 2021 / 8:29 AM IST

Election Results : ఏపీలో వైసీపీ విజయాల పరంపర కొనసాగుతుంది. బుధవారం వచ్చిన మున్సిపల్ ఫలితాల్లో 11 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది వైసీపీ. గురువారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. 11 జడ్పీటీసీ స్థానాలకు 8 స్థానాల్లో విజయం సాధించింది వైసీపీ.. మిగతా మూడు స్థానాలను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. 129 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ 85 చోట్ల విజయం సాధించగా, టీడీపీకి 35 చోట్ల విజయం సాధించింది. జనసేన 5, సీపీఎం రెండు, సీపీఐ, బీజేపీ ఒక్కో స్థానంలో గెలుపొందాయి. రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

చదవండి : Kuppam: కుప్పం కోటపై ఎగిరిన వైసీపీ జెండా

ఇదిలా ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని హిర మండలం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసిన స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు శ్రవణ్ ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి బుచ్చిబాబు 59ఓట్ల మెజారిటీతో శ్రవణ్ పై విజయం సాధించారు. కృష్ణా జిల్లా పెడన స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి ఆర్జా వెంకటనగేష్ విజయం సాధించారు.

చదవండి : Kuppam: చంద్రబాబు కోటలో వైసీపీ దూకుడు.. మున్సిపాలిటీ కైవసం

గుంటూరు జిల్లా శ్యామలాపురం జడ్పీటీసీ స్థానంలో కూడా టీడీపీ విజయం సాధించింది. ఈ శ్యామలాపురం మండలం వినుకొండ నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గానికి బ్రహ్మనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి హైమావతి 1,046 భారీ మెజారిటీతో విజయం సాధించింది. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని గుండాలపాడు, వేమవరం ఎంపీటీసీల్లో టీడీపీ విజయం సాధించింది. కాగా ఇది ఇది రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే ప్రాంతం