Kuppam: చంద్రబాబు కోటలో వైసీపీ దూకుడు.. మున్సిపాలిటీ కైవసం

చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం కంచుకోటను బద్దలు కొట్టింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

Kuppam: చంద్రబాబు కోటలో వైసీపీ దూకుడు.. మున్సిపాలిటీ కైవసం

Chandrababu

Kuppam: చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కంచుకోట. గత ఏడు దఫాలుగా అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబే కుప్పం నుంచి గెలిచారు. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ కాస్త తగ్గినా.. ఇక్కడ పసుపు జెండా ఎగరుతూనే ఉంది. ఎట్టకేలకు ఈ కంచుకోటను బద్దలు కొట్టింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

కుప్పం కోటను బద్దలు కొట్టాలనే వ్యూహంతో పనిచేసిన వైసీపీ.. నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం ఫలితాల మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు కాస్త వెనుకబడ్డారు. ఈ విషయం వైసీపీ నేతల మైండ్లో బాగా ఫిక్స్ అయ్యింది. గట్టిగా ప్రయత్నిస్తే దెబ్బ కొట్టడం కష్టమేమీ కాదని ఫిక్స్ అయిన వైసీపీ పంచాయితీ ఎన్నికల్లో కూడా విజయం సాధించింది.

ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలుపే లక్ష్యంగా పనిచేసింది. కుప్పంలో టీడీపీకి చెక్‌ పెట్టడానికి వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. కుప్పం నియోజకవర్గంలో బీసీల జనాభా ఎక్కువ కాగా.. వీరిపై దృష్టి పెట్టిన వైసీపీ.. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మున్సిపల్ ఎన్నికల్లో సైతం విజయం సాధించింది.

Rajampet: రాజంపేటలో వైసీపీదే గెలుపు.. నాలుగు వార్డుల్లోనే టీడీపీ!

మొదటి రౌండ్‌ జరిగిన కౌంటింగ్‌లో మొత్తం 14 వార్డులకుగాను 13 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. దీంతో కుప్పం మున్సిపాలిటీ వైసీపీ కైవసం అయ్యింది. హైకోర్టు ఆదేశాలతో కుప్పంలో కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ప్రత్యేక అధికారి ప్రభాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కౌంటింగ్‌ ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

AP Election: దాచేపల్లి వైసీపీదే.. బోణి కొట్టిన జనసేన.. గెలుపు లెక్కలు ఇవే!