అదుపులోకిరాని స్టెరిన్ గ్యాస్ లీకేజీ.. విరుగుడును విశాఖకు తెప్పిస్తున్న కేంద్రం

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో లీకైన విష వాయువు స్టైరిన్ గ్యాస్ ఇంకా అదుపులోకి రావడం లేదు. ఉదయం నుంచి నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ గ్యాస్ లీకేజీ అదుపులోకి రావడం లేదు. దాంతో గుజరాత్ నుంచి విశాఖకు స్టైరిన్ గ్యాస్‌కు విరుగుడును కేంద్రం తెప్పిస్తోంది. స్టైరిన్‌కు విరుగుడుగా పీటీబీసీ (పారా టెర్షియరీ బ్యుటైల్ క్యాటెకాల్) పనిచేయనున్నట్టు ఎల్జీ ప్రతినిధులు చెబుతున్నారు.
ట్యాంకర్లలో నుంచి ఎగసిపడుతున్న గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు నీళ్లు జల్లించేందుకు యత్నిస్తున్నారు. స్లింటర్స్ మాత్రమే కాకుండా పీటీబీసీ కెమికల్ కూడా కేంద్రం విశాఖకు తెప్పిస్తోంది. ఈ పీటీబీసీ కెమెకల్ స్ప్రే చేయడం ద్వారా గ్యాస్ లీకేజీని కంట్రోల్లోకి తీసుకురావొచ్చునని అంటున్నారు. న్యూట్రలైజ్ చేసే దిశగా అక్కడి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ప్లూయిడ్‌తో అయినప్పటికీ గ్యాస్ లీకేజీ అదుపులోకి రావడం లేదు.ట్యాంకర్లను స్టెరిన్ విష వాయువులు బయటకు వస్తూనే ఉన్నాయి. గాలి ద్వారా విష వాయువులు వేగంగా విస్తరిస్తున్నాయి. పక్కనే ఉన్న చెట్లు కూడా మాడిపోతున్నాయి.
ఫ్లూయిడ్ లిక్విడ్ ద్వారా గ్యాస్ లీకేజీని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికులను ఖాళీ చేయించిన అధికారులు వారికి ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేశారు. గ్యాస్ అదుపులోకి వచ్చిన తర్వాత మాత్రమే వారిని తిరిగి గ్రామంలోకి అనుమతించే అవకాశం ఉంది.
Also Read | విశాఖ ఘటన మరువక ముందే మరో ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్… పలువురి పరిస్థితి విషమం