నిమ్మగడ్డ తొందరపడ్డారు…ఆయన ఎస్ఈసీ అని హైకోర్టు చెప్పలేదు

  • Published By: murthy ,Published On : May 30, 2020 / 02:45 PM IST
నిమ్మగడ్డ తొందరపడ్డారు…ఆయన ఎస్ఈసీ అని హైకోర్టు చెప్పలేదు

Updated On : May 30, 2020 / 2:45 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నియామకం విషయంలో హై కోర్టు ఇచ్చిన తీర్పులో, రమేష్ కుమార్  వెంటనే ఎస్ఈసీ గా కొనసాగవచ్చని హై కోర్టు చెప్పలేదని ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ చెప్పారు. ఎస్ఈసీ నియమించే అధికారం రాష్ట్రానికి లేదని..ఇదే విషయం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకానికి కూడా వర్తిస్తుందని ఆయన తెలిపారు. శుక్రవారం ఏపీ, ఎస్ఈసీ,  వివాదంలో హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన సర్క్యులర్లు పై ఆయన అభ్యంతరం చెప్పారు. 

తన పునరుధ్ధరణకు సంబంధించి  రమేష్ కుమార్ ఇచ్చిన సర్క్యులర్లు  హై కోర్టు తీర్పునకు అనుగుణంగా లేవని శ్రీరామ్ వివరించారు.  జస్టిస్ కనగ రాజును ఎస్ఈసీగా నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హై కోర్టు తోసిపుచ్చినట్లు రమేష్ కుమార్ తన సర్క్యులర్లలో రాశారని ఆయన తెలిపారు.  ఎస్ఈసీ అంశంపై  హై కోర్టు ఇచ్చిన తీర్పుపై  స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పిటీషన్ వేశాం అని ఈలోపే రమేష్ కుమార్ తొందరపడి సర్క్యులర్ లు విడుదల చేశారని అన్నారు. 

తీర్పు వచ్చిన  వెంటనే రమేష్ కుమార్ ఎస్ఈసీగా కొనసాగవచ్చని హై కోర్టు చెప్పలేదని శ్రీరామ్ అన్నారు. హైదరాబాద్ లోని క్యాంపు ఆఫీసులో ఉంటూ విజయవాడ ఆఫీసు నుంచి విడుదల చేసినట్లు సర్క్యులర్లలో పేర్కోన్నారన్నారు. తనకు కేటాయించిన వెహికల్స్ ను హైదరాబాద్ క్యాంపు ఆఫీసుకు పంపాలని కూడా సర్క్యులర్ జారీ చేశారని శ్రీరామ్ చెప్పారు.