ఇంగ్లీషు లాంగ్వేజ్ లొల్లి : బాబుది ద్వంద్వ వైఖరి..నిలదీసిన సీఎం జగన్

ఇంగ్లీషు మీడియంపై ప్రతిపక్ష నేత బాబుది ద్వంద్వ వైఖరి అంటూ సీఎం జగన్ నిలదీశారు. బాబు కుమారుడు లోకేష్ ఏ మీడియంలో చదివారని ప్రశ్నించారు. పేద వాడికి ఇంగ్లీషు చదువులు అందించాలని ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి అవకాశం ఉన్నా..ఇంగ్లీషును ఎందుకు ప్రమోట్ చేయలేదని సభలో ప్రశ్నించారు. ఇంగ్లీషు చదువు అందకుండా ఉండేందుకు ఓ వర్గం ప్రయత్నిస్తోందని తెలిపారు. 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీషు బాషపై చర్చ జరిగింది. చర్చలో పాల్గొన్న జగన్..బాబును నిలదీశారు. తెలుగు సబ్జెక్టును ఎత్తివేస్తున్నారంటూ దుష్ర్పాచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
* ప్రజల్లో తిరుగుబాటు మొదలు కావడంతో..బాబు యూ టర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.
* తుగ్లక్ చర్యలను తూర్పారబట్టండి అన్న బాబు..ఆంగ్లం..రెండూ అవసరమేనని సన్నాయి నొక్కులు నొక్కడం మొదలు పెట్టారని విమర్శించారు.
* ఆంగ్లానికి వ్యతిరేకం కాదని..ఆనాడు చెప్పారని..అంటే..బాబు చిత్తశుద్ధి ఏంటో గమనించాలన్నారు.
* 2014 – 2019 వరకు పాలన చేసే అవకాశం టీడీపీకి దక్కిందని గుర్తు చేశారు.
* 44 వేల ప్రభుత్వ స్కూళ్లల్లో 66 శాతం స్కూళ్లు..తెలుగు మీడియాన్ని బోధిస్తున్నాయని సభకు తెలిపారు.
ఇంగ్లీషు మీడియాన్ని నిరుపేద పిల్లల వద్దకు తీసుకెళ్లే బాధ్యత అప్పటి ప్రభుత్వానికి ఉందన్నారు. ప్రైవేటు స్కూళ్లలో 95 శాతం ఇంగ్లీషును బోధిస్తున్నారని వివరించారు. 6 వేళ్ల స్కూళ్లను మూసివేశారని, బాబు హాయాంలో స్కూళ్లల్లో కనీస సదుపాయాలు లేవన్నారు. అక్టోబర్, నవంబర్ నెలలు వచ్చినా..పాఠ్య పుస్తకాలు ఇవ్వని పరిస్థితి ఆనాడు నెలకొందన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సరుకుల బిల్లులను పెండింగ్‌లో పెట్టారని, ఆయాలకు జీతాలు ఇవ్వలేని దారుణ పరిస్థితి ఉందన్నారు.
Read More : టచ్ చేయవద్దు : చీఫ్ మార్షల్‌కు మండలి ఛైర్మన్ వార్నింగ్