AP BJP : ఏపీ బీజేపీలో విషాదం

బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ లో విషాదం నెలకొంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు గాంధీ

AP BJP : ఏపీ బీజేపీలో విషాదం

Ap Bjp

Updated On : August 21, 2021 / 10:33 AM IST

బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ లో విషాదం నెలకొంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గాంధీ విశాఖ కేజీహెచ్‌లో చేరారు. శనివారం ఉదయం కన్నుమూశారు. లోకుల గాంధీ మృతి పట్ల ఏపీ బీజేపీ అధక్షుడు సోము వీర్రాజు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు.

చాలా చాలా బాధాకరమైన విషయం, భగవంతుడి ఆటలో ఎవరి వంతు ఎప్పుడో చెప్పలేని పరిస్థితి, ఈ క్షణం మనతో ఉన్నా, మరు క్షణం కూడా మనతోనే ఉంటారని నమ్మకంగా చెప్పలేని రోజులివి. ఒళ్ళంతా జాతీయతను నింపుకుని, నిరంతరం దేశం కోసం పోరాడుతూ, వందలాది మంది గిరిజనులను ప్రోత్సహించి పార్టీలో చేర్పించి, పార్టీ అభివృద్ధికి తనవంతు బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తున్న ధైర్యవంతులైన గిరిజన నాయకులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువకులు, ఐఐటియన్ శ్రీ లోకుల గాంధీ గారు ఇలా అకస్మాత్తుగా మరణించడం చాలా చాలా బాధాకరం.

వారి మరణం పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.