కొత్త జిల్లాలు ఏర్పాటు, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం(జూలై 15,2020) ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. కీలక అంశాలపై చర్చించింది. కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ పూర్తి నిర్ణయాలను మంత్రి పేర్నినాని వెల్లడిస్తారు.
* గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పరిశీలనలో ముగ్గురి పేర్లు
* ప.గో జిల్లా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు
* కడప జిల్లా రాయచోటికి చెందిన దివంగత నేత అఫ్జల్ సతీమణి మైనా జాకియా
* గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్
* కొత్త జిల్లాలను కూడా ప్రకటించే అవకాశం
* 25 జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలపై నిర్ణయం
* జిల్లాల ఏర్పాటు అధ్యయనం చేసేందుకు సీఎస్ నేతృత్వంలో కమిటీ
* జిల్లా ఏర్పాటులో ఖర్చులను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
* పాత గుంటూరు పీఎస్ లో ముస్లిం యువతపై కేసులు ఎత్తివేస్తూ నిర్ణయం
* క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ లో 9 జూనియర్ స్టెనో, 10 టైపిస్ట్ పోస్టులు, 10 జూ.అసిస్టెంట్ పోస్టులు భర్తీకి ఆమోదం
* పులివెందులలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో 5 టీచింగ్, 6 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కేబినెట్ ఆమోదం
* కర్నూలు జిల్లా ప్యాపిలిలో గొర్రెల కాపరుల శిక్షణ కేంద్రం ఏర్పాటు
* నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ చేయూత పథకంపై చర్చించిన మంత్రివర్గం
* 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక సాయం అందించే పథకం
* నాలుగు దశల్లో రూ.75వేల ఆర్థిక సాయం అందించే పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర