AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్త రెవెన్యూ, డివిజన్లకు ఆమోదం

పెరిగిన జిల్లాల నేపథ్యంలో జడ్పీల కాల పరిమితి ముగిసే వరకు కొనసాగించేదుకు కేబినెట్ ఆమోదించింది. పంచాయితి రాజ్ చట్ట, సవరణకు ఆమోదించారు. కొత్త రెవెన్యూ, డివిజన్లకు ఆమోదం లభించింది.

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. కొత్త రెవెన్యూ, డివిజన్లకు ఆమోదం

Ap Cabinet (2)

Updated On : April 7, 2022 / 5:42 PM IST

AP Cabinet Key decisions : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక అంశాలను ఆమోదించింది. మిలెట్ పాలసీకి మంత్రి మండలి ఆమోదం లభించింది. డిగ్రీ కళాశాలలో 574 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్ట్ ల భర్తీకి ఆమోదం తెలిపింది. పెరిగిన జిల్లాల నేపథ్యంలో జడ్పీల కాల పరిమితి ముగిసే వరకు కొనసాగించేదుకు కేబినెట్ ఆమోదించింది. పంచాయితి రాజ్ చట్ట, సవరణకు ఆమోదించారు.

కొత్త రెవెన్యూ, డివిజన్లకు కేబినెట్ ఆమోదం లభించింది. ఏపీ టూరిజం కార్పొరేషన్ కు రాజమండ్రిలో 6 ఎకరాలు కేటాయింపు, రాజమండ్రి, కర్నూలు, విజయనగరం, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలలో ప్రభుత్వ హాస్పిటళ్లకు భూ కేటాయింపుకు ఆమోదం లభించింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో పారిశ్రామిక పార్కకు 82 ఎకరాల భూ కేటాయింపుకు అనుమతి లభించింది.

AP Ministers Resignations : సీఎం జగన్ కు రాజీనామా పత్రాలు సమర్పించిన మంత్రులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ మంత్రులంతా రాజీనామా చేసి ముఖ్యమంత్రికి సమర్పించినట్లు తెలుస్తోంది. చివరి కేబినెట్‌ భేటీ సందర్భంగా.. కొత్తపేట, పులివెందుల రెవెన్యూ డివిజన్లకు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ ఆమోదం తెలిపింది.

జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ విజయవంతంగా చేసినందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌కి అభినందనలు తెలుపుతూ కేబినెట్‌ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ను సీఎం జగన్‌ సహా కేబినెట్‌ మంత్రులు అభినందించారు.