రాజధానిలో బంద్ : మహిళల తాళి బొట్లు తెంపుతారా..మీ ప్రభుత్వం ఉండదంటూ శాపాలు

  • Published By: madhu ,Published On : January 4, 2020 / 05:53 AM IST
రాజధానిలో బంద్ : మహిళల తాళి బొట్లు తెంపుతారా..మీ ప్రభుత్వం ఉండదంటూ శాపాలు

Updated On : January 4, 2020 / 5:53 AM IST

శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే..మహిళలపై పోలీసులు అలా ప్రవర్తిస్తారా ? తాళిబొట్లు తెంచారు..గాజులు లాక్కొన్నారు..ఆడోళ్లకు రక్షణ లేదా..మహిళా కమిషన్ ఏం చేస్తోంది..తమను పట్టించుకోరా ? రాజధానికి అవసరం పడుతుందని భావించి భూములు ఇచ్చాం..రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది..తమకు రాజకీయాలు తెలియవు..కానీ ఇప్పుడు తెలుస్తున్నాయి..అమరావతే రాజధానిగా ఉండాలి..ఉండే వరకు తాము పోరాటం చేస్తాం..అంటున్నారు అమరావతి ప్రాంత మహిళలు. 

మహిళలపై పోలీసుల దౌర్జన్యాలను నిరసిస్తూ 2020, జనవరి 04వ తేదీ శనివారం 29 గ్రామాల్లో బంద్ పాటిస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి పిలుపు మేరకు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మందడ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం నుంచి బంద్ కొనసాగుతోంది. రహదారులపైకి రైతులు చేరుకుని నిరసన చేపట్టారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులకు కనీసం మంచినీళ్లు ఇవ్వకూడదని, తమ షాపుల ఎదుట కూర్చొవద్దని రైతులు వెల్లడిస్తున్నారు.

పోలీసుల వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు సహకరించాలంటూ పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మూడు రాజధానుల ప్రకటన, GN RAO కమిటీ ఇచ్చిన నివేదిక అనంతరం అమరావతిలో ఆందోళనలు, నిరసనలు మిన్నంటుతున్నాయి. 18 రోజులుగా రైతులు, మహిళలు, విద్యార్థులు, ప్రజా సంఘాలు నిరసనలు చేపడుతున్నారు. 

* మూడు రాజధానులు, రెండు ఆప్షన్లు. 
* ఏపీలో రాజధాని వ్యవస్థపై BCG సిఫార్సులు.
* వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ.
 

* GN RAO కమిటీ, BCG నివేదికలపై హై పవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. 
* జనవరి 08న కేబినెట్ భేటీ. 
* రాజధానిపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొనే ఛాన్స్. 

 

Read More : అమెరికా – ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు