రాజధాని రగడ : రిలే దీక్షలు..ఆందోళనలు..నిరసనలు

ఏపీలో రాజధాని రగడ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిస్తున్న రైతులు… తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. దీంతో మందడంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. టెంట్ వేసుకునేందుకు పోలీసులు నిరాకరించడంతో రైతులు, మహిళలు రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. సచివాలయ మార్గాన్ని పూర్తిగా బ్లాక్ చేశారు.
దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చివరకు పోలీసులు వెనక్కి తగ్గడంతో గొడవ సద్దుమణిగింది. మూడు రాజధానుల ప్రకటన, BN RAO కమిటీ ఇచ్చిన నివేదికపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. 2019, డిసెంబర్ 26వ తేదీ గురువారం కూడా పలు ప్రాంతాల్లో వినూత్న పద్థతుల్లో నిరసనలు కొనసాగించారు.
* రైతులు టెంట్ వేసుకుని ధర్నా కొనసాగిస్తున్నారు. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు నిర్వహిస్తున్నారు.
* వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
* కృష్ణా, గుంటూరు జిల్లాల్లోను ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి.
* విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ చేపట్టిన ఆందోళనకు విద్యార్థులు మద్దతు తెలిపారు.
* రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ నినాదాలు చేశారు.
* అమరావతిలో రాజధానిని కొనసాగించాలంటూ తుళ్లూరు మహిళలు వినూత్న నిరసనకు దిగారు.
* విష్ణు, లలిత సహస్ర నామ పారాయణం చేశారు.
* అమరావతికి పట్టిన గ్రహణం వీడేందుకే ఈ పారాయణం చేశామన్నారు మహిళలు. అ
– అమరావతిలో భద్రత కట్టుదిట్టం : –
కేబినెట్ మీట్ తర్వాత అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం వస్తే ఆ ప్రాంత రైతులు ఆందోళనలను మరింత ఉధృతం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అమరావతిలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆందోళనలపై ఇప్పటికే నిషేధాజ్ఞలు విధించారు. సెక్రటేరియట్ దారిలో ఆందోళనలు చేయొద్దని హెచ్చరించారు. రాజధాని వాసులెవరూ స్థానికేతరులకు ఆశ్రయం ఇవ్వొద్దని సూచించారు.
Read More : నా పేరు వాడితే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయండి : ఎంపీ విజయసాయిరెడ్డి