భవిష్యత్తు మొత్తం పర్యాటక రంగానిదే.. దేశం గర్వించేలా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కృషి : సీఎం చంద్రబాబు
దేశం గర్వించేలా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

CM Chandrababu
CM Chandrababu: దేశం గర్వించేలా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యోగా డే నిర్వహణలో గిన్నిస్ రికార్డు సాధించామని, యోగా డేను ఘనంగా నిర్వహించడాన్ని ప్రధాని మోదీ కూడా ప్రశంసించారని చెప్పారు.
Also Read: ఏపీ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడానికి నేను రెడీ: రామ్‌దేవ్ బాబా
పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా అనేక రాయితీలు పొందవచ్చు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను రియల్ టైమ్‌లో అమలు చేస్తూ సంస్కరణలకు నాంది పలుకుతామని చంద్రబాబు అన్నారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నా లక్ష్యంమని చెప్పారు. భవిష్యత్తు మొత్తం పర్యాటక రంగానిదే. పర్యాటక సలహాదారుగా ఉండాలని బాబా రాందేవ్ చంద్రబాబు కోరారు. యోగాను ఓ మాస్ మూమెంట్ గా తీసుకొచ్చిన ఘనత రాందేవ్ దేనని చెప్పారు. యోగా ద్యారా క్యాన్సర్ లాంటి వ్యాధులను కూడా తగ్గించవచ్చునని ఆయన నిరూపించారని చంద్రబాబు అన్నారు.
గాయత్రి కథ వింటే డాక్టర్లు చేయలేని చికిత్స కూడా యోగా చేస్తుందని అర్ధమవుతుంది. ఏపీ భవిష్యత్ లక్ష్యం వెల్ నెస్ అండ్ హ్యాపీనెస్ అని హామీ ఇస్తున్నాని చంద్రబాబు అన్నారు. వాట్సాప్ ద్వారా 701 సర్వీసులు ఆగస్టు 15 లోగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఉద్యోగాల కల్పనకు పర్యాటకం గొప్ప వరం. ప్రపంచంలో ప్రతి 10 ఉద్యోగాల్లో ఒకటి పర్యాటక రంగానిదేనని చంద్రబాబు అన్నారు.