‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
అన్నదాత సుఖీభవ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు.

Chandrababu Naidu
Annadata Sukhibhava scheme: అన్నదాత సుఖీభవ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో శనివారం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించిన మొదటి విడత నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పీఎం కిషాన్ పథకంకు సంబంధించిన నిధులను విడుదల చేశారు. ఈ పథకం కింద ఒక్కో రైతుకు రూ.2వేలు జమ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఏపీలోని ఒక్కో రైతుకు రూ.7వేలు జమ చేశాయి.
ఏడాదికి మూడు విడుతల్లో..
అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ప్రతీయేటా రైతులకు రూ.14వేలు ఆర్థిక సహాయం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిషాన్ పథకం కింద ప్రతీయేటా రూ.6వేలు ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఏపీ రైతులకు రెండు పథకాలకు కలిపి రూ.20వేలు ప్రతీయేటా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఈ నిధులు మూడు విడుతల్లో జమ అవుతాయి. మొదటి విడతకు సంబంధించి పీఎం కిసాన్ పథకం కింద రూ.2వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5వేలు మొత్తం రూ.7వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. ఇందుకు సంబంధించిన నిధులను తాజాగా.. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రకాశం జిల్లా దర్శిలో సీఎం చంద్రబాబు విడుదల చేశారు.
‘అన్నదాత సుఖీభవ’ నిధులు రాకుంటే ఇలా చేయండి..
అన్నదాత సుఖీభవం పథకం కింద ప్రభుత్వం అందిస్తోన్న లబ్ధిదారుల జాబితాలో ఎవరైనా రైతుల పేర్లు లేకున్నా, వారి ఖాతాల్లో డబ్బులు జమ కాకపోయినా గ్రామాల్లో అందుబాటులో ఉన్న రైతు సేవా కేంద్రాలను సంప్రందించాలని అధికారులు సూచిచారు. సొమ్మురాని రైతులకు నెల రోజుల పాటు గ్రీవెన్సుకు అవకాశం కల్పించారు. రైతుల పేర్లలో తప్పులు దొర్లినా, ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్ల అనుసంధానంలో పొరపాట్లు చోటుచేసుకున్నా సొమ్ము జమ కాదు. ఇటువంటి రైతులు రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే ఆయా తప్పులు సరిచేసి సొమ్ము మంజూరయ్యేలా చూస్తారు. ఈనెల 2వ తేదీ నుంచి నెల రోజుల వరకు గ్రీవెన్సుకు అవకాశం ఉందని అధికారులు చెప్పారు.