Anganwadi Workers : అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. సమ్మె కాలానికి జీతాలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ!

Anganwadi Employees : ఏపీలోని అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 42 రోజులపాటు సమ్మె కాలానికి జీతాలు చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Anganwadi Workers : అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. సమ్మె కాలానికి జీతాలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ!

CM Jagan Government Good News For Anganwadi Workers

Updated On : March 15, 2024 / 8:04 PM IST

Anganwadi Employees : ఏపీలోని అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సమ్మె కాలాన్ని డ్యూటీలో ఉన్నట్లుగా పరిగణిస్తూ ఈ మేరకు శుక్రవారం (మార్చి 15)న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 42 రోజులపాటు సమ్మె కాలానికి జీతాలు చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే, సమ్మె కాలాన్ని చెల్లించే జీతంలో కోత విధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుంచి ఈ సంవత్సరం జనవరి 22వ తేదీ వరకు అంగన్వాడీలు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 42 రోజులపాటు అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. వేతనాల పెంపుతో సహా పలు డిమాండ్లతో సమ్మెలోకి దిగారు. ఈ సమ్మె కాలాన్ని డ్యూటీలో ఉన్నట్లుగా పరిగణిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. ఆమె ఇంటి వద్ద హైటెన్షన్