AP CM Jagan: ఒంగోలుకు సీఎం జగన్: సున్నా వడ్డీ పధకం నిధులు విడుదల
రూ.1261 కోట్ల వడ్డీని వారి తరుపున పొదుపు సంఘాల మహిళల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేయనుంది.

Jagan
AP CM Jagan: రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యంగా స్వయం సహాయక బృందాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీకే రుణాలు అందిస్తుంది. రుణాల రూపేణా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న వడ్డీ నిమిత్తం ఇప్పటికే రెండు దఫాల్లో రూ.2354 కోట్ల వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించింది. ఇక శుక్రవారం మరో రూ.1261 కోట్ల వడ్డీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల 9.76 లక్షల స్వయం సహాయక సంఘాలలోని కోటి 2 లక్షల 16 వేల మందికి పైగా మహిళలు, బ్యాంకులకు కట్టవలసిన రూ.1261 కోట్ల వడ్డీని వారి తరుపున పొదుపు సంఘాల మహిళల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేయనుంది. ఈమేరకు సీఎం జగన్ శుక్రవారం ఒంగోలులో ఒక్క బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు.
Also read:SBI Customers Alert : ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. ఈ ఫోన్ నెంబర్స్‌తో జాగ్రత్త
జిల్లాల పునర్విభజన, మంత్రి వర్గ కూర్పు అనంతరం సీఎం జగన్ పాల్గొననున్న మరో భారీ సమావేశం ఇది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు పాల్గొననున్నారు. ఒంగోలులో అందిస్తున్న రూ.1261 కోట్ల వడ్డీతో కలిపి ఇప్పటివరకు స్వయం సహాయక సంఘాల తరుపున ప్రభుత్వం చెల్లించిన మొత్తం వడ్డీ విలువ రూ.3615 కోట్లుగా ఉంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల మహిళలపై వడ్డీ భారం పడకూడదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు “వైఎస్ఆర్ సున్నా వడ్డీ” పధకం ద్వారా ఆయా మహిళలకు లబ్ది చేకూరుస్తుంది.
Also read:Telangana Congress : జానారెడ్డికి కోపం వచ్చింది ? ఎందుకు ?