జగన్‌ను వెంటాడుతున్న ‘విచక్షణాధికారం’

ఏపీ సీఎం జగన్‌కు ‘విచక్షణాధికారం’ వెంటాడుతోంది. ఆయన తీసుకున్న నిర్ణయాలకు విచక్షణాధికారం అనే అంశం మోకాలడ్డుతోంది. ఈ మధ్యకాలంలో ఏపీలో విచక్షణాధికారం అనే అంశం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులు శాసనమండలిలో పాస్ కాలేదనే సంగతి తెలిసిందే. మండలి ఛైర్మన్ విచక్షణాధికారాన్ని ఉపయోగించి..ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారు.
ఛైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించారంటూ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మండలి రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా..స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో కాక పుట్టించింది. రాష్ట్రంలో మెజార్టీ సంఖ్యలో వైసీపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికవడం..కొద్ది రోజుల్లో విజయోత్సవాలు జరుపుకోవాలని అనుకుంటున్న తరుణంలో ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
కమిషనర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆయనకు అధికారాలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రతొక్కరూ విచక్షణాధికారికారాలు ఉపయోగిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ‘కలెక్టర్లను, ఎస్పీలను మారుస్తావు..పేదల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయవద్దంటావు..ఇదెక్కడ న్యాయం..ప్రజాస్వామ్యం ఉందా ? అలాంటి అధికారం ఆయనకు ఉందా ? ప్రజలు ఓట్లేసి ముఖ్యమంత్రులను చేయడం ఎందుకు ? ఈసీ కమిషనర్..సీఎంగా చేసేయొచ్చు కదా ?’ అంటూ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
స్థానిక ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేస్తోందన్న కారణంతో ఎన్నికలను వాయిదా వేశారని దుయ్యబట్టారు. కరోనా వైరస్ అనే కారణం చెప్పిన ఎన్నికలను వాయిదా వేసే ముందు ప్రభుత్వాన్ని సంప్రదించారా ? దీనిపై ఎక్కడిదాకైనా వెళుతామని చెప్పడంతో సీఎం జగన్ ఈ అంశాన్ని ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థమౌతోంది. ప్రస్తుతం ఈసీ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాలపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
Read More : తిరుపతిలో కరోనా టెర్రర్ : రుయాలో చేరిన ఇద్దరు..ఐదు దేశాలను చుట్టి వచ్చిన యువతి!