AP Covid Updates : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 1,679 మందికి పాజిటివ్!
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,679మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Ap Corona Updates 1,679 New
AP Corona Updates : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,679మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 27,522 మంది నుంచి శాంపిల్స్ పరీక్షించగా.. 1,679 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే గడిచిన 24 గంటల్లో 9,598 మంది కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులెటిన్‌ను రిలీజ్ చేసింది.
కరోనా కారణంగా రాష్ట్రంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఉండగా.. మరొకరు కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి మృతిచెందారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 23,08,622 మందికి కరోనా సోకింది. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,679కి చేరింది. గణాంకాల ప్రకారం ఏపీలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,47,824 కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 46,119 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
ఏపీలో బుధవారం నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలోనే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఒక్క జిల్లాలోనే 350 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా జిల్లాలో 225 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అనంతపురం జిల్లాలో 102, చిత్తూరు జిల్లాలో 102, గుంటూరు జిల్లాలో 212, వైఎస్ఆర్ కడప జిల్లాలోల 104, కర్నూలు జిల్లాలో 103, నెల్లూరు జిల్లాలో 91, ప్రకాశం జిల్లాలో 87, శ్రీకాకుళం జిల్లాలో 22, విశాఖపట్నం జిల్లాలో 128, విజయనగరం జిల్లాలో 11, పశ్చిమ గోదావరి జిల్లాలో 142 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మొత్తంగా 1,679 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Read Also : Rayachoti District Issue: రాయచోటిని జిల్లా చేస్తేనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి