AP Covid Numbers : ఏపీలో కొత్తగా 69 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 12వేల 820 కరోనా పరీక్షలు చేయగా 69మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. (AP Covid Numbers)

AP Covid Numbers : ఏపీలో కొత్తగా 69 కరోనా కేసులు

Ap Corona

Updated On : March 16, 2022 / 7:24 PM IST

AP Covid Numbers : ఏపీలో గడిచిన 24 గంటల్లో 12వేల 820 కరోనా పరీక్షలు చేయగా 69మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. గడిచిన 24 గంటల్లో మరో 82 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 26 కరోనా కేసులు వచ్చాయి.(AP Covid Numbers)

విశాఖపట్నంలో 9, పశ్చిమ గోదావరి జిల్లాలో 8, తూర్పుగోదావరి జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, నెల్లూరు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో మొత్తం 23,19,012 పాజిటివ్ కేసులు నమోదవగా.. 23,03,690 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివకు 14వేల 730మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 510 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 3,32,91,315 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.(AP Covid Numbers)

అటు దేశంలోనూ కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. కొత్త కేసులు వరుసగా మూడోరోజు 3 వేలకు దిగువనే నమోదయ్యాయి. మంగళవారం 7 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2వేల 876 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ప్రస్తుతం దేశంలో మహమ్మారి వ్యాప్తి రెండేళ్ల కనిష్ఠానికి తగ్గింది. 24 గంటల వ్యవధిలో మరో 98 మంది కోవిడ్ తో మృతి చెందారు. ఇప్పటివరకూ 4.29 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.(AP Covid Numbers)

Coronavirus India : భారత్‌‌లో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 2 వేల 876 కేసులు

రోజురోజుకూ యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 32,811(0.08 శాతం)గా ఉంది. నిన్న 3,884 మంది కోలుకోగా.. మొత్తం రికవరీలు 4.24 కోట్లు(98.82 శాతం) దాటాయి.

మరోవైపు కరోనా టీకా కార్యక్రమం దశలవారీగా కొనసాగుతోంది. బుధవారం నుంచి 12 నుంచి 14 ఏళ్ల వయస్సు వారికి టీకా పంపిణీ ప్రారంభమైంది. బయోలాజికల్ ఇ తయారు చేసిన కార్బెవాక్స్ వేస్తున్నారు. ఈ దశలో సుమారు 7.11 కోట్ల మంది చిన్నారులు లబ్ధి పొందనున్నట్లు కేంద్రం అంచనా వేసింది. అలాగే 60 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరికీ కూడా ప్రికాషనరీ డోసు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకూ కేంద్రం 180 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేసింది. నిన్న 18.9 లక్షల మంది టీకా వేయించుకున్నారు.

Covid : నేటి నుంచి 12-14 ఏళ్ల వారికి కోవిడ్ టీకా

భారత్‌లో ఇప్పటివరకూ 180 కోట్లకు పైగా డోసులు పంపిణీ అవగా.. అందులో 15 నుంచి 17 వయస్సు వారికి 9 కోట్లకు పైగా డోసులు, రెండు కోట్లకు పైగా ప్రికాషనరీ డోసులు ఇచ్చారు. 12-14 ఏళ్ల వయస్సు వారికి టీకా పంపిణీ ప్రారంభమైన నేపథ్యంలో.. భారత టీకా కార్యక్రమంలో ఈరోజు ముఖ్యమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజల సహకారంతోనే గత ఏడాది ప్రారంభం నుంచి ఈ టీకా కార్యక్రమం సజావుగా సాగుతోందన్నారు. ఇతర దేశాల్లో టీకా పట్ల అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. మన దగ్గర ప్రజలు టీకా తీసుకోవడమే కాకుండా, ఇతరులు టీకా తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారని, ఈ తీరు చూడటానికి చాలా బాగుందని ప్రధాని అన్నారు.