Covid : నేటి నుంచి 12-14 ఏళ్ల వారికి కోవిడ్ టీకా

12-14 ఏళ్ల వారందరికీ ప్రస్తుతం బయోలాజికల్‌-ఈ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్‌ టీకాను మాత్రమే ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు..

Covid : నేటి నుంచి 12-14 ఏళ్ల వారికి కోవిడ్ టీకా

Covid

Covid Vaccination : కరోనా భూతం ఇంకా వీడడం లేదు. వైరస్ కారణంగా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. అయితే.. గతంలో కన్నా తక్కువగా కేసులు రికార్డవుతున్నాయి. ఈ వైరస్ కు చెక్ పెట్టేందుకు నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు పెద్దల వరకు మాత్రమే వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం లేదు. 12 నుంచి 14 ఏండ్ల వయస్సున్న పిల్లలకు వ్యాక్సినేషన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. 12-15 ఏళ్ళు గల పిల్లలకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ టీకాలు అందజేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్ సుఖ్ మండవియా వెల్లడించిన సంగతి తెలిసిందే.

Read More : Telangana Corona Report : తెలంగాణలో కొత్తగా 81 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత విస్తరించింది కేంద్ర ప్రభుత్వం. 2022, మార్చి 16వ తేదీ బుధవారం నుంచి 12-14 ఏళ్ల వారికి టీకా పంపిణీని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం పలు సూచనలు చేసింది. 12 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు టీకాలు ఇచ్చేందుకు ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. వ్యాక్సిన్లు కలిసిపోకుండా ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కోరింది.

Read More : AP Corona Report : ఏపీలో కొత్తగా 59 కరోనా కేసులు

12-14 ఏళ్ల వారందరికీ ప్రస్తుతం బయోలాజికల్‌-ఈ సంస్థ అభివృద్ధి చేసిన కార్బెవాక్స్‌ టీకాను మాత్రమే ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు అందించాలని స్పష్టం చేసింది. 2010 అంతకంటే ముందు జన్మించిన పిల్లలు ఈ టీకా తీసుకునేందుకు అర్హులని కేంద్రం పేర్కొంది. టీకా కోసం పిల్లల పేర్లను ఆన్‌లైన్‌లో కొవిన్‌ యాప్‌లో నమోదు చేయాలని వెల్లడించింది. లేదా వ్యాక్సినేషన్‌ సెంటర్‌కు వెళ్లి కూడా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపింది. పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ ఇస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. ముఖ్యంగా వ్యాక్సిన్‌ మిక్సింగ్‌ లాంటివి జరగకుండా చూసుకోవాలని కోరింది. టీకా ఇవ్వడంలో శిక్షణ పొందిన వారినే వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌లో నియమించాలని తెలిపింది. టీకాల వృథాను అరికట్టాలని కోరింది.