Narayana Swamy : నోటా కంటే జనసేనకే తక్కువ ఓట్లు వచ్చాయి.. ఏపీలోను అదే పరిస్థితి వస్తుంది : నారాయణ స్వామి

తెలంగాణలో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా జనసేనకు రాలేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎద్దేవా చేశారు. ఏపీలోను అదే పరస్థితి వస్తుంది అన్నారు.

Narayana Swamy : నోటా కంటే జనసేనకే తక్కువ ఓట్లు వచ్చాయి.. ఏపీలోను అదే పరిస్థితి వస్తుంది : నారాయణ స్వామి

Narayana Swamy

Narayana Swamy criticizes Pawan Kalyan : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఓటమిపాలైంది.జనసేన అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. దీనిపై వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ పై విమర్శలు సంధిస్తున్నారు. తెలంగాణలో నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా జనసేనకు రాలేదంటూ ఎద్దేవా చేస్తున్నారు. దీంట్లో భాగంగానే చిత్తూరులో జగనన్న ఉచిత క్యాంటీన్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతు..ఏపీలో కూడా జనసేన పరిస్థితి అదేనంటూ ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ తన కులాన్ని చంద్రబాబు నాయుడుకు అమ్ముకుంటున్నారంటూ విమర్శించారు. తెలంగాణలో జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే ఒక్కచోట కూడా డిపాజిట్ రాలేదంటూ సెటైర్లు వేశారు. నోటా కన్నా పవన్ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయని ఏపీలో కూడా అదే పరిస్థితి వస్తుందన్నారు. కాపులు పవన్ కళ్యాణ్ కు దూరం కాబోతున్నారని అన్నారు. పవన్ తన సామాజిక వర్గానికి చేసిందేమీ లేదంటూ దుయ్యబట్టారు.

తెలంగాణలో విజయం ఏపీ కాంగ్రెస్‌లో నూతనోత్సాహం.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి వ్యూహ రచన

ఇదే అంశంపై ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు కూడా పవన్ పై విమర్శలు చేశారు.ఆంద్రప్రదేశ్ రాష్ట్ర౦లో జరుగుతున్న రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని అన్న ఆయన పవన్ కళ్యాణ్ బీజేపీతో, చంద్రబాబు నాయుడు కాంగ్రెసు ముసుగులో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.జనసేన పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో డిపాజిట్లు కూడా రాలేదని..కనీసం 1000 నుంచి 2000 ఓట్లు కూడా రాలేదంటూ ఎద్దేవా చేశారు. కూకట్ పల్లిలో కమ్మవారి ఓట్లు రాబట్టుకోవటలో కూడా పవన్ విఫలమయ్యారని విమర్శించారు.

పవన్ కళ్యాణ్ టీడీపీ ఇచ్చిన స్క్రిప్టు చదవటానికే పరిమితమయ్యారని..ఇక నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వారి ఆటలు కట్టించాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచి అన్ని పధకాలను గడగడపకు అందించిన ఘనత వైస్ జగన్ మోహన్ రెడ్డిదేనని అన్నారు.