DSC Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ నోటిఫికేషన్, టెట్ పరీక్ష షెడ్యూల్‌ విడుదల

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

DSC Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ నోటిఫికేషన్, టెట్ పరీక్ష షెడ్యూల్‌ విడుదల

AP DSC 2024

Updated On : February 7, 2024 / 3:59 PM IST

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 12 నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని బొత్స సత్యనారాయణ చెప్పారు.

మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్‌లలో పరీక్షలు ఉంటాయన్నారు. ఏప్రిల్‌ 2న ఫైనల్‌ కీ విడుదల చేస్తామన్నారు.

వయోపరిమితి 44 ఏళ్లకు పెంచామని తెలిపారు. ఇకనుంచి రెగ్యులర్ గా డీఎస్సీ వేస్తామని చెప్పుకొచ్చారు. వచ్చిన ఖాళీలను వచ్చినట్లే భర్తీ చేస్తామని చెప్పారు. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్స్ టీచర్లు ఉండేలా చూస్తామని చెప్పారు. ఇచ్చిన కంటెట్‌ను ఎంతవరకు అమలు చేస్తున్నారో నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు.

ఏ పోస్టులు ఎన్ని?
2280 పోస్టులు-ఎస్జీటీ
2299 స్కూల్ అసిస్టెంట్స్
1264 పీజీటీ
టీజీటీ 215
ప్రిన్సిపాల్స్ 42
మొత్తం ఉపాధ్యాయ పోస్టులు 6,100

బొత్స కామెంట్స్

  • విద్యపైన 72వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు చేశాము
  • విద్య మా ప్రభుత్వ ప్రాధాన్యం
  • సీఎం జగన్ నెలకు రెండు సార్లు విద్యపైన సమీక్ష చేస్తున్నారు
  • ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ విద్య అమలు చేస్తున్నాం
  • పేద ఉద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాము
  • దేశంలోనే ఐబీ విద్యను అందించే రాష్ట్రం ఏపీ ఒక్కటే
  • సీబీఎస్సీ విద్యను అందిస్తున్నాము
  • ఇంగ్లిష్ విద్యను అమలు చేస్తున్నాం
  • ఇంగ్లిష్ మీడియం వద్దు అన్నం వాళ్లే మళ్లీ కావాలంటున్నారు
  • ఫలితాలు ఆవిధంగా ఉన్నాయి
  • విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఇవ్వాలి
  • విద్యార్థులకు ట్యాబ్స్ ఇచ్చాము
  • 60 వేల రూపాయల ఐఎఫ్టీలు పెట్టాము
  • పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు పెట్టాము

 

టెట్ పరీక్ష షెడ్యూల్‌
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ ప్రకటించిన వేళ టెట్ పరీక్ష షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 8 తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదే రోజు నుంచి అప్లికేషన్స్ తీసుకుంటామని విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

కంప్యూటర్ ఆధారిత టెస్ట్ నిర్వహిస్తున్నాని చెప్పారు. మార్చి 27 తేది నుంచి ఏప్రిల్ 9 తేది వరకు పరీక్ష ఉంటుందన్నారు. 2022లో టెట్ నిర్వహించామని, మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 8న విడుదల చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

శరవేగంగా సికింద్రాబాద్ కొత్త రైల్వే స్టేషన్ పనులు: కిషన్ రెడ్డి