AP Express Train : ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

ఏపీ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. S6 బోగీలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి.

AP Express Train : ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

Ap Express Train Caught Fire

Updated On : January 21, 2022 / 11:08 AM IST

AP Express Train Fire : ఏపీ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. S6 బోగీలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ఆ బోగిలోని ప్రయాణకులంతా భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన రైల్వేశాఖ వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో ఏపీ ఎక్స్ ప్రెస్‌ను నిలిపివేసింది.

దాదాపు గంటపాటు రైలుని నిలిపివేశారు. రైలు బ్రేకులు జాం కావడంతో పొగలు వ్యాపించి ఉండొచ్చునని రైల్వే అధికారులు చెబుతున్నారు. గంటకు పైగా నెక్కొండ రైల్వే స్టేషన్‌లోనే ఏపీ ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేశారు. రైలులో మంటలు వ్యాపించడానికి గల కారణాలపై రైల్వే అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

గంటపాటు రైలు నిలిచిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రమాద ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో వారితో పాటు రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఏపీ ఎక్స్ ప్రెస్ రైల్లో మంటలు చెలరేగిన ఘటనకు సంబంధించి విచారణ జరిపిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు.

Read Also : Fever Survey: తెలంగాణలో ఫీవర్ సర్వే, లక్షణాలు ఉంటే వైద్య కిట్లు అందజేత