Sajjala Ramakrishnareddy : అన్ని విషయాలు చర్చల్లో అంగీకరించి.. బయటకెళ్లి మళ్లీ ఆందోళనంటున్నారు

50 వేల జనాభా స్లాబులో ఎక్కువగా ఉండేది టీచర్లు స్లాబ్ పెంచాలని కోరారు. 8 శాతం నుండి 10 శాతానికి పెంచామని వెల్లడించారు. చర్చల్లో దీనికి అంగీకరించారు.

Sajjala Ramakrishnareddy : అన్ని విషయాలు చర్చల్లో అంగీకరించి.. బయటకెళ్లి మళ్లీ ఆందోళనంటున్నారు

Sajjala (2)

Updated On : February 6, 2022 / 3:57 PM IST

adviser Sajjala Ramakrishnareddy : ఉపాధ్యాయ సంఘాల నేతలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పిట్ మెంట్ పెంచాలని టీచర్ సంఘాల నేతలు కోరారు.. ఆర్ధిక ఇబ్బంది పెంచే పరిస్థితి లేదని చెప్పామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అన్ని విషయాలు చర్చల్లో అంగీకరించారు.. బయటకి వెళ్లి మళ్ళీ ఆందోళన అంటున్నారని పేర్కొన్నారు. ఇంతకంటే ఎక్కువ చేసే పరిస్థితి ప్రస్తుతం లేదని స్పష్టం చేశారు. వారికి ఇబ్బంది ఉంటే చర్చల్లో చెప్పాల్సింది.. ఒప్పందం అయ్యాక బయటకి వెళ్లి మాట్లాడడం సరికాదన్నారు.

50 వేల జనాభా స్లాబులో ఎక్కువగా ఉండేది టీచర్లు స్లాబ్ పెంచాలని కోరారు.. 8 శాతం నుండి 10 శాతానికి పెంచామని వెల్లడించారు. చర్చల్లో దీనికి అంగీకరించారు.. మినిట్స్ అయ్యాక బయటకి వెళ్లి రివర్స్ అవ్వడం అస్సలు బాగాలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇదొక చిన్న అపశృతి.. పట్టు విడుపులు ఉంటాయి సర్దుకుపోవాలన్నారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్ లు పెట్టడం మంచి పద్ధతి కాదని హితవుపలికారు.

AP PRC Issue: పీఆర్సీ స్టీరింగ్ కమిటీతో ఏకీభవించని ఉపాధ్యాయ సంఘాలు, రంగంలోకి పోలీసులు

ఉద్యోగుల ఆవేదన గుర్తించాం కనుకే ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సీఎం జగన్ డేర్ చేశారని పేర్కొన్నారు. ఆధిపత్య ధోరణి ఎక్కడ కనిపించిందో పవన్ చెప్పాలన్నారు. అలాంటి దిక్కుమాలిన ఆలోచన ఎక్కడా చెయ్యలేదు.. చేసి ఉంటే ఛలో విజయవాడ వంటి కార్యక్రమం జరిగేదా..? అని ప్రశ్నించారు. తక్కువ సమయంలో సమస్య పరిష్కారం అయ్యిందన్నారు. ఇందులో పొలిటికల్ కోణాలు వెతుక్కుంటూ కామెంట్స్ చేస్తే తాము పట్టించుకోబోమన్నారు.