Pawan Kalyan : ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన జీవోలు రద్దు చేయాలి : పవన్ కళ్యాణ్

ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన జీవోలు రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించాలని కోరారు. ఆప్షన్ల పేరుతో మభ్యపెట్టవద్దన్నారు.

Pawan Kalyan : ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన జీవోలు రద్దు చేయాలి : పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Updated On : November 13, 2021 / 8:10 PM IST

aided educational institutions : ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన జీవోలు రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించాలని కోరారు. ఆప్షన్ల పేరుతో మభ్యపెట్టవద్దన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలను రద్దు చేయాలని పేర్కొన్నారు. అప్పుడే విద్యార్థులు, వారి తల్లితండ్రులు చేస్తున్న ఆందోళనకు ఫలితం ఉంటుందన్నారు. వారు చేస్తున్న డిమాండ్ లో స్పష్టత ఉందని చెప్పారు.

తమ బిడ్డలు చదువుతున్న విద్యా సంస్థలను ఎప్పటిలాగే కొనసాగించాలని తెలిపారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా ఆ విద్యా సంస్థలు నిర్వహణ సాగేలా చూడాలని తల్లితండ్రులు కోరుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తాము చదివే కాలేజీలు, స్కూళ్ళు ప్రైవేట్ విధానంలోకి వెళ్తే ఫీజులు భరించలేమని చెబుతూనే ఉన్నారని చెప్పారు.

Minister KTR : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సర్వతోముఖాభివృద్ధి : మంత్రి కేటీఆర్

ప్రభుత్వం- మెమో ద్వారా ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఆప్షన్లు ఇచ్చామని ప్రకటన చేసినా అందులో మతలబులే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఆప్షన్ల పేరుతో విద్యార్థులను, తల్లితండ్రులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వాహకులకు ఇచ్చిన వాటిలో మొదటి రెండింటినీ బలంగా ప్రభుత్వం చెబుతోందన్నారు. అంటే కచ్చితంగా ప్రభుత్వం నాలుగు జీవోల ద్వారా తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉందన్నారు.

నాలుగు మార్గాలు చెప్పాం… విద్యాసంస్థల నిర్వాహకులు ఏదో ఒకటి ఎంచుకొంటారు అంటూ విద్యా శాఖ తన బాధ్యతను తప్పించుకోకూడదని చెప్పారు. ఎప్పటిలాగే ఎయిడెడ్ విద్యా సంస్థలు కొనసాగాలంటే జీవో 42, జీవో 50, జీవో 51, జీవో 19లను పూర్తిగా రద్దు చేయాలని సూచించారు.

Million March : బీజేపీ మిలియన్ మార్చ్ వాయిదా

1982నాటి విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉన్న ఈ జీవోలను రద్దు చేయడంతోపాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఆందోళనలు తాత్కాలికంగా సద్దుమణిగేలా చేసేందుకు మెమోల రూపంలో ప్రకటనలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇలా అయితే విద్యార్థులకు అన్యాయమే జరుగుతుందన్నారు.