AP Govt Amnesty Life Prisoners : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..175 మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జీవిత ఖైదీలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తోన్న 175 మందికి క్షమాభిక్షను ప్రసాదించింది.

AP Govt Amnesty Life Prisoners
AP Govt Amnesty Life Prisoners : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జీవిత ఖైదీలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో జీవిత ఖైదీలుగా శిక్ష అనుభవిస్తోన్న 175 మందికి క్షమాభిక్షను ప్రసాదించింది.
జీవిత ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నియమించిన స్టాండింగ్ కమిటీ సిఫార్సుల మేరకు సత్పవర్తన కలిగిన ఖైదీలకు స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.
MK Stalin: పోలీసులకు సీఎం వరాలు.. 700మంది ఖైదీల విడుదల
అయితే, విడుదలవుతున్న ఖైదీలు రూ.50వేల పూచికత్తు సమర్పించాలని సూచించింది. విడుదల అవుతున్న వ్యక్తులు మూడు నెలలకు ఒకసారి సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని వెల్లడించింది. మళ్లీ నేరపూరిత చర్యలకు పాల్పడితే తక్షణమే రీఅరెస్టు తప్పదని హెచ్చరించింది.