AP High Court : ప్రభుత్వ కార్యాలయాలను వైజాగ్‌కు తరలించడం లేదు.. హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం

ఈ పిటీషన్ ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని రిజిస్ట్రీలో అప్లికేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని కోరారు.

AP High Court : ప్రభుత్వ కార్యాలయాలను వైజాగ్‌కు తరలించడం లేదు.. హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం

AP Government Departments Shifting (Photo : Google)

Updated On : December 12, 2023 / 6:07 PM IST

వైజాగ్ కు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి నేతలు దాఖలు చేసిన పిటిషన్స్ పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని కార్యాలయాలను విశాఖకు ప్రస్తుతం తరలించడం లేదని తెలిపింది. కార్యాలయాలు తరలిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమే అని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

Also Read : జగన్ ఎంతమందిని మార్చినా ఓటమి ఖాయం : సీపీఐ నారాయణ

ఈ పిటీషన్ ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని రిజిస్ట్రీలో అప్లికేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత ఇవ్వాలని నిన్న హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో కార్యాలయాలను తరలించడం లేదని హైకోర్టుకు సమాచారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

Also Read : వైసీపీకి సింగిల్ డిజిట్ అని ఐ ప్యాక్ సర్వే తేల్చేసింది.. అందుకే జగన్ చేతులెత్తేశారు : బోండా ఉమ