Amaravati Brand Ambassadors : అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు..
ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కార్యాలయం నామినేట్ చేసిన వారిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.

Amaravati Brand Ambassadors : రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించింది. వివిధ స్థాయిల్లో అమరావతి నగరానికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకునేలా కార్యాచరణ రూపొందిస్తోంది. సుస్థిరత, అభివృద్ధి, ఆవిష్కరణ, సామాజిక స్థితి ప్రాతిపదికన బ్రాండ్ అంబాసిడర్లను ఎంపిక చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.
వివిధ రంగాల్లో నిపుణులు, రాజధాని ప్రాంతంలో ప్రజల్లో మమేకమైన వ్యక్తులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. నామినేషన్ ప్రాతిపదికన బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కార్యాలయం నామినేట్ చేసిన వారిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది.
Also Read : ఇప్పుడు వంశీ వంతు.. నెక్స్ట్ కొడాలి నానినేనా? కూటమి సర్కార్ అసలు గేమ్ స్టార్ట్ చేసిందా?
వచ్చిన నామినేషన్ల నుంచి వారి నైపుణ్యం, అర్హత, స్థాయిల ఆధారంగా ప్రభుత్వ అనుమతి తీసుకుని బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోనున్నారు. ఒక ఏడాది కాలానికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోనున్నారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతిని ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లు కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం పేర్కొంది. ఏపీ ఆర్ధికవృద్ధిలో అమరావతి ప్రాజెక్ట్, స్మార్ట్ సిటీగా అమరావతి దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా బ్రాండ్ అంబాసిడర్లు చూడాలని పేర్కొంది.