Notification for Jobs : నిరుద్యోగులకు త్వరలో శుభవార్త చెప్పనున్న జగన్ సర్కారు
ఏపీలో నిరుద్యోగులు త్వరలో శుభవార్త వినబోతున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి శాఖలు, విభాగాల వారీగా క్యాలెండర్ రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Ap Government Shortly Release Job Notification
AP Government shortly release Job notification : ఏపీలో నిరుద్యోగులు త్వరలో శుభవార్త వినబోతున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి శాఖలు, విభాగాల వారీగా క్యాలెండర్ రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా అన్ని శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలను లెక్కగట్టి ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించాలని చీఫ్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
ఖాళీల వివరాలకు సంబంధించి క్యాలెండర్ ను మే 31న విడుదల చేస్తారని చెప్పారు. ఈ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చెయ్యాలని సీఎస్ ఇటీవల అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను ఆదేశించారు.
గ్రామ, వార్డు సచివాలయాలల్లో పోస్టుల భర్తీ తోపాటు.. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో ఖాళీలు, బ్యాక్‌లాగ్ పోస్టుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు.